చిరంజీవి( Chiranjeevi ) కొడుకుగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్ తాజాగా ఒక సందర్భంలో నెపోటిజం గురించి, ఇతర విషయాలకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.నిజం చెప్పాలంటే నెపోటిజం అంటే ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదని చరణ్ కామెంట్లు చేశారు.
ఈ మధ్య కాలంలో నెపోటిజం( Nepotism )గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని రామ్ చరణ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
బంధు ప్రీతి ఉంటుందని భావించే వాళ్ల వల్లే ఈ చర్చ ఎక్కువగా జరుగుతోందని చరణ్ పేర్కొన్నారు.
నాకు యాక్టింగ్ ఇష్టమని బాల్యం నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని చరణ్ అన్నారు.సినిమానే ఊపిరిగా తీసుకుంటూ ఎంతోమంది నిర్మాతలను కలుస్తూ ప్రాజెక్ట్ లు చేస్తున్నానని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం.
మనస్సుకు నచ్చిన పని చేయడం వల్లే 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని రామ్ చరణ్ అన్నారు.
మా నాన్న వల్లే ఇండస్ట్రీలోకి వచ్చినా నాకు నేనుగా ప్రయాణం సాగించాలని అనుకుంటున్నానని చరణ్ ( Ram charan ) చెప్పుకొచ్చారు.ప్రతిభ లేకపోతే ఈ ప్రయాణం సులువు కాదని సక్సెస్ లేదా ఫెయిల్యూర్ నీ కొరకు పని చేసేవాళ్లను జాగ్రత్తగా చూసుకో చాలు అని నాన్న చెప్పారని రామ్ చరణ్ వెల్లడించారు.నాన్న చెప్పిన మాటలను నేను గుర్తుంచుకుంటానని చరణ్ అన్నారు.
సల్మాన్ ఖాన్ అంటే తనకు ఇష్టమని చరణ్ అన్నారు.
స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయాలని ఉందని చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. రెమ్యునరేషన్ ను పెంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా రామ్ చరణ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
రామ్ చరణ్ వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.