కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు.నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనేలా ఉంటాయి.
ఇలా మాటలు అనుకోవుడు.అలా కలసి పోవుడు షరా మామూలే.
మొన్నటి దాకా రేవంత్ రెడ్డీ పై విరుచుకు పడే జగ్గా రెడ్డీ సడెన్ గా రూటు మార్చి.ములాఖాత్ అన్నాడు.
ఇక మిగిలిన నేతలు కూడా ఇప్పుడు సద్దు మనిగారు.తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీనియర్లు సైతం ఇప్పుడు చల్ల బడ్డారు.
కొత్త ఇంచార్జీ మంతనాలు సక్సెస్ కావడంతో.సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క.
రేవంత్ రెడ్డి తో కలసి.కాంగ్రెస్ శిక్షణా తరగతులు నిర్వహించారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డీ సైతం తన పట్టు విడిచి.గాంధీ భవన్ మెట్లు ఎక్కి.రేవంత్ తో చేతులు కలిపారు.దాంతో కాంగ్రెస్ కేడర్ ఫుల్ జోష్ లో నిండి పోయింది.
ఇంత వరకు ఎలా ఉన్నా.ఇక్కడ మరో వివాదం కాంగ్రెస్ పార్టీ లో చిగురించింది.
ఇన్నాళ్లు రేవంత్ ఒక్కడే కోమటి రెడ్డీ వెంకట్ రెడ్డి నీ వ్యతిరేకిస్తూ ఉన్నాడు అనుకుంటే.ఇప్పుడు అనూహ్యంగా.కొండా ఫ్యామిలీ ఎంటర్ అయింది.
కొత్త ఇంచార్జీ పెట్టిన మీటింగ్ లో ఏకంగా.వెంకట్ రెడ్డి పై విరుచుకు పడింది.
పార్టీ కి వెంకటరెడ్డి ఎంతో నష్టం చేశాడు అని.వెంటనే పార్టీ నుంచి తొలగించాలి అనిం డిమాండ్ చేశారు.అక్కడితో ఆగకుండా.కోమటి రెడ్డి లాంటి వల్ల వల్ల పార్టీ ఎదగ లేక పోతోంది అని అధ్యక్షుడు వెంటనే చర్యలు తీసుకోవాలి అని బిష్మించుకు కూర్చున్నారు.
అంతలో రేవంత్ రెడ్డీ కలుగ జేసుకొని.వ్యక్తిగత విమర్శలు వద్దు అని వారించాడు.పార్టీ ఎజెండా మంత్రమే మాట్లాడాలి అని సూచించారు.
ఇక ఏవైనా వ్యక్తిగత విషయాలు ఉంటే ఇంచార్జీ కి కంప్లైంట్ చేయాలని సూచించారు.దాంతో.
ఇప్పుడు కొండా వర్సెస్ కోమటి రెడ్డీ గా కాంగ్రెస్ కొత్త వివాదం తెరమీదకు వచ్చింది.మరి ఇప్పుడు పుట్టిన ముసలం.
ముందు ముందు ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో చూడాలి.