వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రాష్ట్ర సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని ఆరోపించారు.
ప్రజా ధనాన్ని దోచుకునే హక్కు వైసీపీ నేతలకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ రిసార్ట్ నిర్మిస్తున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలో రిసార్టు పరిశీలనకు వెళ్లేందుకు టీడీపీ నేతలు పిలుపునిస్తే అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం అమానుషమని పేర్కొన్నారు.కల్యాణ దుర్గాన్ని కబ్జాల నగరంగా మార్చారని విమర్శించారు.
తప్పు చేయకపోతే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.







