చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ దక్కింది.
రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని రివ్యూలు వచ్చేస్తున్నాయి.ఇలాంటి నేపథ్యంలో రామ్ చరణ్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
సైరా నరసింహారెడ్డి చిత్రంకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు.అందుకే ఆయన ఈ చిత్రంలో చిన్న పాత్ర పోషిస్తే బాగుంటుందని అంతా భావించారు.
కాని చరణ్ మాత్రం ఈ చిత్రంలో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపించినట్లుగా అనిపించలేదు.
తన పాత్ర కోసం కథను డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేని చరణ్ తనకు ప్రత్యేకంగా పాత్ర క్రియేట్ చేయవద్దని దర్శకుడు సురేందర్ రెడ్డికి తెలియజేయడం జరిగింది.
అందుకే ఈ చిత్రంలో రామ్ చరణ్ లేకుండా పోయాడు.ఒకవేళ సినిమాలో చరణ్ ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.ఖైదీ చిత్రంలో చిన్న క్లిప్‌లో ఉన్నందుకే ఈలలు గోలలు, అలాంటిది ఒక పాత్ర చేస్తే కుమ్ముడే.

మెగా మల్టీస్టారర్ అంటూ టాక్ రావడంతో పాటు అంతా కూడా సినిమాపై ఆసక్తి పెంచుకునేవారు.సైరా చిత్రంలో తండ్రి కొడుకులు అంటూ ప్రచారం జరగడంతో అంచనాలు ఆకాశానికి పెరిగేవి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సైరా చిత్రం షూటింగ్ సమయంలో పలు సందర్బాల్లో చరణ్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లాడు.
కాని ఎప్పుడు కూడా కెమెరా ముందుకు వెళ్లాలనే ఆలోచన మాత్రం చేయలేదు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇంతటి భారీ చిత్రంలో చిన్న పాత్రను అయినా కోరుకుంటారు.
కాని చరణ్ మాత్రం అలా కోరుకోలేదు.అయినా ఇంతటి సినిమాను నిర్మించింది ఆయనే కనుక ఆయనకు ఎలాంటి లోటు లేదని కొందరు మెగా ఫ్యాన్స్ అంటున్నారు.