ఇకపై వాటిపట్ల దూరంగా వ్యవహరిస్తే జైలు పాలే..!

మూగ జీవులపై హింసాత్మాక కార్యక్రమాలకు పాల్పడడం ఈ మధ్య ఎక్కువ అయిపోయింది.నోరు లేదు కదా అని కుక్కల నుంచి పిల్లుల వరకూ అన్నీ జీవులపై చిన్నచూపు చూస్తున్నారు.

 Animals, Jail, Majaor, Rajya Shaba, Fine, Minister Giraj Singh,pca Act,latest Ne-TeluguStop.com

వాటిని కొట్టడం, చంపడం, చిత్ర హింసలు పెట్టడం లాంటివి కూడా ఈమధ్య కాలంలో చాలానే జరిగాయి.కొంత కాలం క్రితం కడుపుతో ఉన్న ఏనుగుకు తినే ఆహారంలో పేలుడు బాంబులు పెట్టి ఆ ఏనుగు చావుకి కారణం అయ్యారు కొంతమంది.

మరి కొంతమంది అయితే కుందేలు, లేడీ లాంటి జీవులను వెంటాడి చంపి తింటున్నారు.మానవుల స్వార్ధం కోసం ఏ పాపం తెలియని మూగ జీవుల ప్రాణాలను తీస్తున్నారు.

చట్టం అంటే భయం లేకపోవడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పాలి.మహా అయితే జరిమానా వేస్తారు అంతేకదా అనుకుంటున్నారు.

చిన్నపాటి జరిమానాలు, శిక్షలు వాళ్లను ఆలోచింపచేయవు.మళ్ళీ మళ్ళీ తప్పు చేసేలా ప్రేరేపిస్తాయి.

వాళ్లలో మార్పు తేవాలంటే ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అధికారులు భావిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ అంశంపై శుక్రవారం రాజ్యసభలో రాత పూర్వకమైన రెస్పాన్స్ వచ్చింది.

దీనికి సంబంధించి మత్స్య, జంతు సంరక్షణ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దీనిపై మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఉన్న పీసీఏ చట్టం 1960ను అమెండింగ్ చేయాల్సి ఉంది.ఇప్పటివరకు జంతువుల హింసపై ఉన్న పెనాల్టీని మంగళవారం జంతు సంరక్షణ శాఖ, మంత్రిత్వ శాఖ కలిసి జంతువులపై హింసకు శిక్షగా రూ.50 ల పెనాల్టీను పెంచాలని తెలిపింది.మూగ జీవులను కొట్టినా, తన్నినా, వేధించినా, వాటిని ఆకలితో ఉంచినా, ఎక్కువ బరువులు మోయించిన, వాటిపై స్వారీలు చేసి వాటిని కొట్టిన గాని శిక్ష తప్పదు.

అయితే మరొక ఇంగ్లీష్ మీడియా కథనం ప్రకారం.ఒకవేళ జంతువులపై జరిపై హింస వలన వాటికి చిన్న గాయాలు అయిన, పెద్ద గాయాలు అయినా గానీ, ఆ మేజర్ గాయాల వల్ల ఆ జంతువులకు పర్మినెంట్ డిజెబిలిటీ జరగొచ్చు.అలాంటప్పుడు రూ.750 నుంచి రూ.75వేల వరకూ జరిమానాతో పాటు ఐదేళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది.గత కొన్ని సంవత్సరాలుగా జంతువుల హక్కుల కోసం జంతు సంఘాలు పోరాడుతూనే వస్తున్నాయి.

ఇప్పుడున్న శిక్షలను మరింత కఠినతరం చేస్తేనే మనుషులలో మార్పు వస్తుందని సూచిస్తున్నాయి.తాజాగా ఇప్పుడు ఈ నిర్ణయం వలన జంతువులపై క్రూరత్వంతో చేసే చర్యలు కొంత వరకు అయిన తగ్గుతాయేమో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube