వారి విష‌యంలో జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే జ‌గ‌న్‌కు స‌మ‌స్య‌లు త‌ప్ప‌వా..

ఏ పార్టీకి అయినా స‌రే పార్టీలో ఉండే సెకండ్ గ్రేడ్ నాయ‌కులు చాలా ముఖ్యం.ఎందుకంటే పార్టీల త‌ర‌ఫున ఓ ఏజెంట్ లాగా ప్ర‌జ‌ల‌కు అత్యంత ద‌గ్గ‌రగా ఉండేది మాత్రం వారేన‌ని చెప్పాలి.

 If You Are Not Careful About What You Do Then You Have Problems With Jagan, Jaga-TeluguStop.com

వీరి విష‌యంలో అగ్ర నేత‌లు గ‌న‌క నిర్ల‌క్ష్యం వ‌హిస్తే గ‌న‌క ఫ‌లితాలు మ‌తారుమారు అయిపోతాయి.ఒక పార్టీ అధికారంలోకి రావాల‌న్నా లేదంటే ఒక పార్టీ ఓడిపోవాల‌న్నా కూడా ప్ర‌ధానంగా వీరే కార‌ణం అవుతుంటారు.

ఇక వైసీపీలో వీరంతా కూడా ఇప్పుడు చాలా నిరాశ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఆ పార్టీలో ప‌దువుల విష‌యంలో వీరికి తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇప్పుడు వీరంతా కూడా ముఖాముఖి భేటీల విషయంలో సీఎం జ‌గ‌న్ ఒక్క‌సారైనా త‌మ‌తో పాల్గొనాల‌ని వారంతా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.ఎందుకంటే జిల్లాల త‌ర‌ఫున ఎంత‌మంది మంత్రులు, లేదంటే ఎమ్మెల్యేలు ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న వాస్తవ ప‌రిస్థితులను వారు చెప్పలేరన్నది వీరి వాద‌న‌.

ఎందుకంటే గ‌తంలో చంద్ర‌బాబు కూడా జిల్లాల త‌ర‌ఫున ప్రజాప్రతినిధులకు ప్ర‌త్యామ్నాయంగా ఉంటున్న కన్సల్టెంట్లు, సలహాదారులు చంద్రబాబుకు త‌ప్పుడు స‌మ‌చారాం ఇవ్వ‌డంతో వారంతా కూడా చంద్ర‌బాబుకు పెద్ద న‌ష్ట‌మే చేశారు.

Telugu Ap Cm Jagan, Chandra Babu, Jagan, Grade-Telugu Political News

దాంతో ఆయ‌న పార్టీ ఘోరంగా ఓడిపోయింది.ఇప్పుడు జ‌గ‌న్ కూడా త‌మ వైసీపీ ఇంత‌టి ఘనవిజయం పొంద‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ద్వితీయశ్రేణి నేత‌ల‌ను ఇప్పుడు ప‌క్క‌న పెడుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.వారిని ప‌ట్టించుకోకుండా కేవ‌లంం మంత్రులు, ఎమ్మెల్యేల‌నే న‌మ్మ‌డంతో పార్టీ కింది స్థాయిలో బలం కోల్పోతుంద‌ని తెలుస్తోంది.

కాబ‌ట్టి వీరంతా కూడా ఇప్ప‌డు జ‌గ‌న్‌తో ఒక ముఖాముఖిలో పాల్గొనాల‌ని కోరుకుంటున్నారు.అప్పుడే వాస్త‌వ ప‌రిస్థితులు జ‌గ‌న్ దాకా వెళ్తాయ‌ని వారంతా భావిస్తున్నారు.చూడాలి మ‌రి జ‌గ‌న్ ఏ మేర‌కు వీరికి అవ‌కాశం ఇస్తారో.ఒక వేళ వీరిని గ‌న‌క ప‌క్క‌న పెడితే అది జ‌గ‌న్‌కే ప్ర‌మాద‌మ‌ని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube