తెలంగాణ బిజెపి( Telangana bjp )లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి.నాయకుల మధ్య ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాల కారణంగా ఆ పార్టీ మరింత బలహీనంగా మారుతోంది.
గతంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఈ తరహా గ్రూపు రాజకీయాలు కనిపించేవి.ఇప్పుడు ఆ పార్టీలో పరిస్థితి మరింత గందరగోళం గా మారింది.
బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బలపడడం , ఇతర పార్టీలోని నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వస్తుండడం వంటివన్నీ ఆ పార్టీలో ఉత్సాహం నింపుతుండగా , బిజెపి లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు, నాయకుల మధ్య విభేదాలు, అసంతృప్త నాయకులంతా రహస్య సమావేశాలు నిర్వహించడం ఇలా పరిస్థితి దిగజారినట్టు కనిపిస్తోంది.
ఈ విషయంలో బిజెపి అధిష్టానం కలుగజేసుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నా, ఫలితం కనిపించడం లేదు. మొన్నటి వరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి పార్టీని బలోపేతం చేసినా, బండి సంజయ్ ( Bandi Sanjay Kumar )ఆ పదవి కోల్పోయిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయారు.ఇక హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తనకు సరైన ప్రాధాన్యం పార్టీలో దక్కడం లేదని, తనను అవమానించేలా పార్టీలోని కీలక నేతల బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, బిజెపి ప్రచార కమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు చేపట్టిన దగ్గరనుంచి ఆయన పార్టీలు చేరికలను ప్రోత్సహించడం, పార్టీని గాడిలో పెట్టడం వంటి విషయాల్లో బాగా వెనకబడ్డారు.దుబ్బాక రఘునందన్ రావు( Dubbaka MLA Raghunandan Rao ), మాజీ ఎంపీ విజయశాంతి వంటి వారు అనేక సందర్భాల్లో పార్టీకి నష్టం చేకూర్చే విధంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి .దీంతో వారు అసలు పార్టీలో కొనసాగుతారా లేదా అని విషయంలో అందరికీ అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక ఇటీవల కొంతమంది పార్టీ కీలక నేతలు రహస్యంగా సమావేశమై, పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తమకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడం, కొత్తగా వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అధిష్టానం వ్యవహరించడం తదితర అంశాలపై నిర్వహించిన సమావేశాలు వంటివి ఆ పార్టీ లో పెద్ద కళకలమే సృష్టించాయి.ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నా, ఆ జాబితా ప్రకటించిన తర్వాత మరింతమంది అలక చెందే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఆ పార్టీ అధిష్టానానికి కూడా కలవరం పుట్టిస్తున్నాయి.