స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతోంది.ఇందులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును సీఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు కోసం సీఐడీ ప్రత్యేక క్వశ్చన్ పేపర్ రెడీ చేసిందని తెలుస్తోంది.సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోసుతో సమావేశాలపై ప్రశ్నించడంతో పాటు బ్యాంకు ఖాతాలపై ఆరా తీయనుందని తెలుస్తోంది.
సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో న్యాయవాదుల సమక్షంలో సీఐడీ విచారణ కొనసాగుతుంది.విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో రెండంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.
కాగా ఈ విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.అదేవిధంగా రేపు కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు.