ఏది ఏమైనా రాజమౌళి ఒక తెలివైన వ్యక్తి .అసలు మన ఇండియా నుంచి ఆస్కార్ కి పంపించాల్సిన లిస్టులో మొదటిసారి ఆర్ఆర్ఆర్ సినిమా ఎంపిక చేయబడలేదు.
దాంతో ఒక్కసారిగా రాజమౌళి బుర్ర కంగునా పనిచేయడం మొదలుపెట్టింది.దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మొదలుపెట్టాడు.
గుజరాత్ నుంచి చెల్లె షో అనే సినిమా ఆస్కార్ కి ఎంట్రీ సాధించుకుంది.ఏ విభాగంలో కూడా ఆస్కార్ కి ఎంపిక కాని మన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రస్తుతం అవార్డు వస్తుంది అనే మాయలో మనం ఉన్నాం.
మరి ఆస్కారికి మన ఇండియా నుంచి ఎవరు పంపించకుండా రాజమౌళి ఎలా వెళ్లాడో తెలుసా ?దాని వెనక పెద్ద తతంగమే జరిగింది.ప్రతి అవార్డు వెనుక మేనేజ్ చేయడానికి చాలా విషయాలు ఉంటాయి.
డబ్బు ఖర్చు పెడుతుంటారు, లాబీయింగ్ చేస్తుంటారు.అందుకే అవార్డులకు రాను రాను విలువ తగ్గుతూ ఉంది.
రాజమౌళి కూడా ఇక్కడ అదే విషయాన్ని గ్రాబ్ చేశాడు.మొదట ఎంట్రీ కోసం ఫర్ యువర్ కన్సిడరేషన్ అనే ఒక ప్రైవేటు దరఖాస్తును చేసుకున్నాడు.
అయితే ప్రైవేట్ ఎంట్రీలు కూడా అఫీషియల్ నామినేషన్ లో జాబితాలకు చేరితేనే పోటీలో ఉంటాయి.అందుకోసం అందరూ లాబీయింగ్ చేస్తారు.కేవలం నాటు నాటు పాట తప్ప మిగతా అన్ని నామినేషన్స్ కూడా ఈ సినిమా నుంచి రిజెక్ట్ చేయబడ్డాయి.కేవలం రాజమౌళి మాత్రమే కాదు మన ఇండియన్ సినిమా పరిశ్రమల నుంచి చాలా మంది ఈ ప్రైవేట్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎవరికి ఆ అవకాశం దక్కలేదు.
ప్రైవేట్ దరఖాస్తు చేసుకున్న వారికి రాకపోయినా పెద్ద నష్టం లేదు.
పోతే వెంట్రుక వచ్చిందా, కొండ.అందుకే రాజమౌళి అక్కడ గట్టిగా కూర్చుని లాబీయింగ్ మొదలు పెట్టాడు.గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రకటించడంతో జర్నలిస్టుల సంఘం ఆస్కార్ కి బాట వేసింది.
నిజానికి తెల్లజాతి వారు మన ఇండియన్స్ సినిమాలను చాలా వివక్షత తో చూస్తారు.అసలు గతంలో కూడా ప్రైవేట్ దరఖాస్తులను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.అన్ని కనికరించి సినిమాకు అవార్డు వస్తే చాలా సంతోషమే.ఏది ఏమైనా ఎన్ని తప్పులు జరిగినా అది మన పాట కాబట్టి అవార్డు వస్తే గుండెలకు హత్తుకోవడం ఖాయం.