టబు ఈ నటుడితో ప్రేమలో పడిందనే విషయం మీకు తెలుసా ?

టబు. పక్క హైదెరాబాదీ నటి.

 Heroine Tabu Love Affairs,tabu,manoj Bajpayee,kuli No.1,tabu Love,tabu Marriage,-TeluguStop.com

హైదరాబాద్ ముస్లిం కుటుంబం లో పుట్టిన టబు స్కూల్కింగ్ కూడా ఇక్కడే చేసింది.అయితే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

కానీ టబు ఫ్యామిలీ మొత్తం ఎంతో ఉన్నత చవులు చదివి ప్రొఫెసర్స్ గా పని చేయడం విశేషం.ఇక టబు తల్లి సైతం టీచర్ గా పని చేసేది.

చదువుకోవడం కోసం ముంబై కి వెళ్లిన టబు అక్కడే మోడలింగ్ చేసింది.ఆ తర్వాత 14 ఏళ్ళ వయసులో హీరోయిన్ గా హిందీ సినిమా ఇండస్ట్రీ లో డెబ్యూ చేసింది.17 ఏళ్ళ వయసులో వెంకటేష్ సరసన హీరోయిన్ గా కూలి నం 1 సినిమాలో తెలుగు లో తొలిసారి నటించింది.హిందీ తో పాటు ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది.

50 ఏళ్ళ వయసులో కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్న టబు యంగ్ గా ఉన్న సమయంలో మాత్రం ప్రేమాయణాలు బాగానే సాగించింది.తన తొలి సినిమా నుంచే ఈ అఫైర్స్ సాగించడం విశేషం.

ఆమె మొదటి సినిమా హీరో సంజయ్ కపూర్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసినా ఈ అమ్మడు ఆ తర్వాత సాజిద్ నడియావాలా తో సైతం పీకల్లోతు ప్రేమలో మునిగితేలింది.ఇక తెలుగు లో నాగార్జున తో ఏకంగా 10 ఏళ్ళ పాటు లవ్ లో ఉంది అనే వార్తలు ఎప్పుడు వస్తూనే ఉండేవి.

అయితే మాది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అంటారు ఈ జంట.ఇక తన చిన్నతనం నుంచి ప్రేమించింది మాతరం అజయ్ దేవగన్ ని.

Telugu Kuli, Manoj Bajpayee, Tabu, Tabu Love, Tollywood-Movie

తన సోదరుడికి స్నేహితుడు కావడం వల్ల అజయ్ ని చిన్నతనం నుంచి ప్రేమిస్తూ పెరిగింది టబు.అతడి కోసమే పెళ్లి కూడా చేసుకోలేదు అనే వార్తలు ఉన్నాయి.ఇదంతా పక్కన పెడితే ఆమెతో కలిసి మూడు సినిమాల్లో నటించిన నటుడు మనోజ్ బాజ్పాయ్ తో కూడా ప్రేమలో పడింది టబు.వీరి ప్రేమ అప్పట్లో సంచలనం సృష్టించింది.మనోజ్ సినిమాల్లో నటించే టైం లో తన సినిమాల కోసం అలాగే తన స్నేహితుల సినిమాల కోసం టబును కావాలనే రికమెండ్ చేసేవాడట.ఇలా కొన్నాళ్ల పాటు వీరి ప్రేమాయణం సాగిన ఏ కారణాల చేతనో అది ముందుకు సాగలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube