ఏమిటయ్యా బిగ్ బాస్ ఈ నిర్వాకం.మరి ఇంత నాసి రకం క్రియేటివ్ టీమ్ తో ఎలా అయ్యా షో నడిచేది.
గత ఆరు సీజన్ల నుంచి చేశున్న నిర్వాకమే మళ్లి చేస్తున్నావ్.వారాంతంలో హోస్ట్ వచ్చి ఒక గంట సేపు ఎదో ఆటలు ఆడించినట్టు ఆడించి వాళ్లలో వారికే ఒకరిని ఎలిమినేట్ చేయించి తీరిగ్గా సీక్రెట్ రూమ్ కి పంపించేయడం.
ఇది అన్ని సీజన్లలో జరుగుతున్న తంతే.అయితే ఎటొచ్చి ఇక్కడ బకరా అయ్యింది ఆర్జే సూర్య.
సీక్రెట్ రూమ్ కి వెళ్ళాక మనోడి భవిష్యత్తు ఏంటో అర్ధం కానీ పరిస్థితి.ఇప్పటి వరకు అస్సలు ఆటలో మజా అంటే ఏంటో జనాలు చూడనే లేదు.
పైగా ఆర్జే సూర్య కి ఇప్పటికే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది.ఆమె బయట మీడియాలో ఇంటర్వ్యూ లు కూడా ఇస్తూ హల్చల్ చేస్తుంది.
అయినా కూడా సూర్య కు ఆరోహి తో ప్రేమాయణం సాగించాలని బిగ్ బాస్ ఆదేశాలు రాగానే రొమాన్స్ మొదలెట్టారు.ఆరోహి కి సైతం ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.
వీళ్ళ లవ్ స్టోరీ లు తెలిసి కూడా బిగ్ బాస్ లవ్వాటలు ఆడుతుంటే చూసే జనాలకు కూడా కనెక్షన్ రాలేదు.ఇక ఇదంత నటన అని కూడా ఆరోహి, సూర్య చెప్పుకుంటూ మరి అటాచ్ అవుతుంటే జనాలకు ఏమాత్రం ఇంట్రెస్ట్ కుదరలేదు.
దాంతో ఆరోహి ని బయటకు పంపించేశాడు.ఇంకా ఇప్పుడు ఇనాయ వంతు వచ్చింది.

మళ్లి బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఇనాయ, సూర్య లవ్ ట్రాక్ స్టార్ట్ చేసారు.ఇప్పుడు కూడా సేమ్.వీరి రొమాన్స్ జనాలకు ఎక్కలేదు.అయినా కూడా ఇనాయ ఏం మాట్లాడుతుందో, ఎందుకు నామినేట్ చేస్తుందో జనాలకు అర్ధం కాక జుట్టు పీక్కున్నారు.ఈ లోపు శ్రీహన్ తో కూడా ట్రాక్ సిద్ధం చేసి చివరకు అతడిని కూడా నామినేట్ చేసి తుస్సుమనిపించిందిల.ఇదంతా గమనిస్తున్న ప్రేక్షకుడు మాత్రం పిచ్చి పట్టేలా ఉంది అంటున్నారు.
ఇక ఈ నాసి రకం ఆటలు, సీక్రెట్ టాస్కులు, సీక్రెట్ రూమ్ కి సూర్య ను పంపించడం, అవసరం లేని లవ్ ట్రాక్ లు జనాలకు తెగ బోర్ కొడుతున్నాయి.ఒక్క హాట్ అమ్మాయి ని హౌస్ లోకి పంపి ఫ్రెష్ మసాలా యాడ్ చేయండి మాస్టారు అంటున్నారు.







