మృణాళిని రవి(Mrunalini Ravi) పరిచయం అవసరం లేని పేరు.ఈమె హీరో విశాల్(Vishal) నటించిన ఎనిమి(Enemi) సినిమాలో టమ్ టమ్ పాటలు నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈ పాట అప్పట్లో సోషల్ మీడియాని ఎలా షేర్ చేస్తుందో మనకు తెలిసిందే.
ఇక ఈమె తెలుగులో కూడా వరుణ్ తేజ్(Varun Tej) హీరో నటించిన గద్దల కొండ గణేష్(Gaddala Konda Ganesh) సినిమాలో హీరోయిన్ గా నటించారు.అయితే ఈ సినిమా ఈమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయింది.
ఇలా తెలుగులో తక్కువ సినిమాలలో నటించిన మలయాళం తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
మృణాళిని రవి ఇటీవల సేలంలోని అమ్మపేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవంలో పాల్గొంది.ఈ ముద్దుగుమ్మ విద్యార్థులకు బహుమతులను అందజేయడమే కాకుండా వారితో కలిసి డాన్సులు చేస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటూ ప్రశ్నించగా విజయ్ అజిత్ ఇద్దరు తనకు ఇష్టమేనని డాన్స్ లో విజయ్ వ్యక్తిత్వంలో అజిత్ అంటే తనకు ఇష్టం అంటూ సమాధానం చెప్పారు.
ఇక బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తనకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేరని చెప్పడమే కాకుండా తనని ఎప్పుడు సంతోషంగా ఉంచుతూ.తనని ఎప్పుడు నవ్విస్తూ ఆనందంగా చూసుకునే ఒకే ఒక్క అర్హత తనకు కాబోయే బాయ్ ఫ్రెండ్ లో ఉండాలని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ప్రస్తుతం అయితే తనకు ప్రేమ పెళ్లి గురించి ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ లేదని ప్రస్తుతం తన చూపు మొత్తం సినిమాలపైనే ఉంది అంటూ తెలియజేశారు.
ఇలా కాలేజీ విద్యార్థులతో మాట్లాడిన ఈమె అనంతరం విద్యార్థులతో కలిసి టమ్ టమ్ అనే పాటకు డాన్స్ చేసి సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.