హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది.
భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రోడ్లపై సైతం వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారీ వర్షానికి జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు.
నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎక్కడ ఏదైనా సమస్య నెలకొంటే వెంటనే కంట్రోల్ రూమ్ కు డయల్ చేయాలని తెలిపారు.