సైకిల్ తో కలుపు తీసే గుంటక యంత్రం.. రైతు ఐడియాతో కూలీల ఖర్చు ఆదా..!

వ్యవసాయ రంగం( Agriculture )లో ఒకవైపు పెట్టుబడి భారం పెరుగుతూ పోతుంటే.గిట్టుబాటు ధర లేక ఎంతో మంది రైతులు అప్పుల బాధ భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Weeding Ditch Machine With Bicycle Labor Cost Saving With Farmer's Idea , Agricu-TeluguStop.com

ఈ క్రమంలో కొంతమంది రైతులు కాస్త వినూత్నంగా ఆలోచించి వ్యవసాయానికి అయ్యే పెట్టుబడి తగ్గించేందుకు సరికొత్త ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు.వ్యవసాయ రంగంలో కూలీల కొరత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో ఓ రైతు కాస్త వినూత్నంగా ఆలోచించి పాత పనికిరాని సైకిల్ తో కలుపు తీసే పరికరాన్ని రూపొందించాడు.మామూలుగా పొలంలో గుంటకకు ప్రతిరోజు 800 రూపాయల కిరాయి అవుతుంది.

పత్తి, మిరప, మొక్కజొన్న, కంది లాంటి తదితర పంటల సాగులో గుంటక చేయడం కోసం పాత సైకిల్ తో గుంటక తయారు చేశాడు.

Telugu Agriculture, Bicycle, Bicycle Weeder, Crop, Farmers, Latest Telugu-Latest

పంట సాగు( Cultivation crop )లో కేవలం కూలీల కోసం దాదాపుగా రూ.20వేల వరకు ఖర్చు అవుతుంది.కూలీల కొరతను అధిగమించడంతోపాటు తక్కువ శ్రమతో ఎక్కువ పని చేసేందుకు ఈ సైకిల్ గుంటక చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ సైకిల్ గుంటక తయారు చేయడానికి రూ.1000 ఖర్చు అయ్యింది.

Telugu Agriculture, Bicycle, Bicycle Weeder, Crop, Farmers, Latest Telugu-Latest

ఈ సైకిల్ గుంటకతో ఒక ఎకరం పొలంలో ముగ్గురు కూలీలు చేసే పనిని ఈ పరికరంతో చేయవచ్చు.ఈ పరికరంతో చాలా సులభంగా కలుపు తీయవచ్చని రైతు చెబుతున్నాడు.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టకపోతే ఎంత నష్టం వాటిల్లుతుందో రైతుల( Farmers )కు బాగా తెలుసు.కూలీల కొరత వల్ల సరైన సమయంలో కూలీలు దొరకరు.

కాబట్టి ఈ సరికొత్త పరికరంతో కలుపు సమస్యకు చెక్ పెట్టవచ్చు.సోషల్ మీడియా పాపులర్ అయ్యాక మనిషి తనలోని ప్రతిభను వెలుగులోకి తెచ్చి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

ఎంతోమంది రైతులు వ్యవసాయ పనులకు ఉపయోగపడే సరికొత్త పరికరాలను తయారు చేస్తూ పెట్టుబడి భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube