స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి( Chandrababu ) ఏసీబీ కోర్టు రిమాండ్ విధించటం తెలిసిందే.దీంతో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఈ క్రమంలో చంద్రబాబుని బయటకు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ లీగల్ టీం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.తాజాగా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో వేసిన చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగబోతుంది.
బాబు బెయిల్ కోసం న్యాయవాది సుబ్బారావు( Subbarao ) ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.ఈ పిటిషన్ నీ స్వీకరించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం రేపు విచారణ చేపడతామని స్పష్టం చేయడం జరిగింది.
ఇక ఇదే కేసులో క్యాష్ కొటేషన్ విచారణను హైకోర్ట్ ఈ నెల 19కి వాయిదా వేయడం జరిగింది.తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు చంద్రబాబునీ ఎలాగైనా బయటికి తీసుకురావడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు.చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.నేడు చంద్రబాబునీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )నీ కలసి బయట మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటన చేయటం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో న్యాయస్థానాలలో చంద్రబాబుని బయటకు తీసుకురావాలని వేస్తున్న బెయిల్ పిటిషన్స్ సంచలనంగా మారాయి.