రేపు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ..!!
TeluguStop.com
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి( Chandrababu ) ఏసీబీ కోర్టు రిమాండ్ విధించటం తెలిసిందే.
దీంతో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.ఈ క్రమంలో చంద్రబాబుని బయటకు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ లీగల్ టీం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.
తాజాగా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో వేసిన చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగబోతుంది.
బాబు బెయిల్ కోసం న్యాయవాది సుబ్బారావు( Subbarao ) ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ఈ పిటిషన్ నీ స్వీకరించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం రేపు విచారణ చేపడతామని స్పష్టం చేయడం జరిగింది.
"""/" /
ఇక ఇదే కేసులో క్యాష్ కొటేషన్ విచారణను హైకోర్ట్ ఈ నెల 19కి వాయిదా వేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు చంద్రబాబునీ ఎలాగైనా బయటికి తీసుకురావడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.నేడు చంద్రబాబునీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )నీ కలసి బయట మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటన చేయటం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో న్యాయస్థానాలలో చంద్రబాబుని బయటకు తీసుకురావాలని వేస్తున్న బెయిల్ పిటిషన్స్ సంచలనంగా మారాయి.
సూపర్ సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ ను పొందాలనుకుంటే ఈ రెమెడీని పాటించండి!