రాజకీయాల్లో పార్టీ మారడం సహజం.వెళ్లిన పార్టీలో సముచిత స్థానం దక్కడం.
దీంతో అప్పటికే అక్కడున్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతూనే ఉంటుంది.అయితే ప్రాంతీయ పార్టీల్లో ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ.
కానీ జాతీయ పార్టీల విషయంలో ముఖ్యంగా కాంగ్రెస్ విషయంలో ఇలాంటి చాలానే కనిపిస్తుంటాయి.అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే.
కాంగ్రెస్ లో ఇప్పుడు నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది.పార్టీ అధినాయకత్వం ఢిల్లీ నుంచే ఆదేశాలు ఇస్తుండటంతో స్టేట్ లో నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఎవరికి వారే పదవులు కావాలి.ఎవరికి వారే అధికారం.
పెత్తనం కావాలి.అది జరగకపోతే సొంత పార్టీ నయకులే రోడ్డెక్కుతారు.
గగ్గోలు పెడతారు.తమకు దక్కాల్సిన పదవులు ఎవరో కొట్టుకు పోయారని గగ్గోలు పెడతారు.
అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఎవరికి ఇవ్వాల్లో పూర్తి చర్చించాకే ఇస్తుంది.అయితే కాంగ్రెస్ లో ఇప్పటికే పదవుల్లో ఉన్న నేతలు.
కురువృద్దులు కాంగ్రెస్ ను ఏం ఉద్ధరిస్తున్నారనేది ప్రశ్న.రాష్ట్ర విభజన తర్వాత నేతల్లో సమన్వయం లేకపోవడంతో నిత్యం అంతర్గత కుమ్ములాటలు బయటపడుతుండటంతో ప్రజల్లో కూడా చులకనవుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఇదే పరిస్తితి ఉంది.ఇక్కడ పార్టీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించారు.
అది అధిష్టానం నిర్ణయం.అయితే ఆయన టీడీపీ నుంచి వచ్చారని.
తమకు దక్కాల్సిన చీఫ్ పదవిని ఆయన ఎత్తుకుపోయారని రకరకాల ఆరోపణలు చేస్తూ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ కి వ్యతిరేకంగా…

ముఖ్యంగా జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు చాన్స్ దొరికితే రేవంత్ కి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.వాస్తవానికి 2014లో రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించిన తర్వాత.పొన్నాల లక్ష్మయ్య పార్టీ చీఫ్ గా ఉన్నారు.
మరి ఆయన నేతృత్వంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారా? అంటే సమాధానం లేని ప్రశ్న.ఇక ఆ తర్వాత.
గత ఎన్నికలకు ముందు.పార్టీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఉత్తమ్ హయాంలోనే ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టారు.కనీసం పది మంది కొత్తవారిని కూడా పార్టీలో చేర్చుకోలేక పోయారు.
బలంగా కేసీఆఆర్ పైనా యుద్ధం ప్రకటించలేక పోయారు.అంటే.
సంస్థాగతంగా.పార్టీకి పునాదులు పడినప్పటి నుంచి పనిచేస్తున్నామని.
జెండా మోస్తున్నామని .చెబుతున్న నాయకుల వల్ల పార్టీకి ఒరిగింది ఏంటి.? అనేది ప్రధానంగా చర్చకు వస్తోంది.
ఇక రేవంత్ విషయాన్ని తీసుకుంటే ఆయన గతంలో ఏ పార్టీలో ఉన్నారనేది పక్కన పెడితే.
పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.ఇక రేవంత్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపు వచ్చిందనేది వాస్తవం.
ప్రతి ఒక్కరినీ బుజ్జగించి.పార్టీలో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని.ధీమా గా చెబుతున్నారు.
మరి ఇలాంటి నేత అవసరమా.? లేక పాత విమర్శలతోనే కాలం గడిపే కురువృద్ధులు.సీనియర్లు అవసరమా?.అనేది తేల్చుకోవాల్సిన అంశంగా చెప్పవచ్చు.