వాట్సాప్ వినియోగదాదురులకు శుభవార్త కొత్తగా రానున్న "వాట్సాప్ చాట్ థ్రెడ్ "

ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు.దాదాపు స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ అప్ ఉంటుంది.

 Good News For Whatsapp Users The Upcoming whatsapp Chat Thread, Whats Up, New Fe-TeluguStop.com

అలాగే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తో మనల్ని అలరిస్తూనే ఉంటుంది వాట్సాప్ అప్.మళ్ళీ ఇప్పుడు మెసేజింగ్​ యాప్​ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరొక సరి కొత్త ఫీచర్స్​ ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.కొత్త కొత్త ఫీచర్స్ తోటి ఎప్పటికప్పుడు వాట్సాప్ యూజర్స్​ను పోగొట్టుకోకుండా ఉండేందుకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.ఇప్పటికే వాట్సాప్ లో చాలా రకాల కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

అదే మాదిరిగా ఈ ఏడాది కూడా యూజర్స్​కు మెరుగైన ఫీచర్స్​ను తీసుకొస్తామని ప్రకటించింది.  ఈ క్రమంలోనే మెసేజింగ్​ను మరింత యూజర్​ ఫ్రెండ్లీ చేసేలా మరో అద్భుతమైన ఫీచర్​ను మన ముందుకు తీసుకురానుంది.

అదేంటంటే ‘వాట్సాప్​ చాట్​ థ్రెడ్’​ ఫీచర్.

ఈ ఫీచర్​ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇకపై యూజర్లు తమ సమస్యలను వాట్సాప్​కు సులభంగా నివేదించవచ్చు.

అంతేకాక సమస్యలను తెలియ చేసిన కేవలం 48 గంటల్లోనే సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు.​ ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది బీటా యూజర్స్​కు మాత్రమే అందుబాటులో ఉన్నది.

రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్​ యూజర్స్​ అందరికీ పరిచయం చేస్తామని వాట్సాప్​ స్పష్టం చేసింది.ఒకవేళ మీరు వాట్సాప్ బీటా యూజర్ అయితే వాట్సాప్​ బీటా వెర్షన్​ను అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది.

తద్వారా మీకు కూడా వాట్సాప్​ థ్రెడ్​ ఫీచర్​ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

ఈ ఫీచర్​ మీకు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు వాట్సాప్ సెట్టింగ్స్​లోకి వెళ్లి, హెల్ప్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి.

దానిలో కాంటాక్ట్​ అజ్ అనే ఆప్షన్​ఫై క్లిక్​ చేయండి.మీకు ఒకవేళ వాట్సాప్ చాట్ థ్రెడ్‌ యాక్సెస్​ ఉంటే, అక్కడ ఒక డైలాగ్​ బాక్స్​ కన్పిస్తుంది.లేదంటే ఎటువంటి డైలాగ్​ బాక్స్​ కన్పించదు.మీకు ఫీచర్​ అందుబాటులో ఉంటే దానిలో మీరు ఎదుర్కొంటున్న టెక్నికల్​ సమస్యను నమోదు చేయాలి.

అనంతరం మీరు థ్రెడ్‌ను ప్రారంభించగానే వాట్సాప్ మీ సమస్యకు పరిష్కారాన్ని గ్రూప్ చాట్‌లో చూపిస్తుంది.మీ డివైజ్​ సమాచారం, ఇతర టెక్నికల్​ వివరాల యాక్సెస్​ కోసం పర్మిషన్​ అడుగుతుంది.

ఈ సమాచారాన్ని వాట్సాప్​తో పంచుకోవాలా? లేదా? అనే ఆప్షన్​ కూడా ఇస్తుంది.ఈ ఫీచర్​ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్​ పరికరాల్లో మాత్రమే రోల్​ అవట్​ అవుతోంది.

రాబోయే రోజుల్లో అందరికి అందుబాటులోకి వస్తుందట.!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube