వాట్సాప్ వినియోగదాదురులకు శుభవార్త కొత్తగా రానున్న "వాట్సాప్ చాట్ థ్రెడ్ "

ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు.దాదాపు స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ అప్ ఉంటుంది.

అలాగే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తో మనల్ని అలరిస్తూనే ఉంటుంది వాట్సాప్ అప్.

మళ్ళీ ఇప్పుడు మెసేజింగ్​ యాప్​ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరొక సరి కొత్త ఫీచర్స్​ ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.

కొత్త కొత్త ఫీచర్స్ తోటి ఎప్పటికప్పుడు వాట్సాప్ యూజర్స్​ను పోగొట్టుకోకుండా ఉండేందుకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.

ఇప్పటికే వాట్సాప్ లో చాలా రకాల కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

అదే మాదిరిగా ఈ ఏడాది కూడా యూజర్స్​కు మెరుగైన ఫీచర్స్​ను తీసుకొస్తామని ప్రకటించింది.

  ఈ క్రమంలోనే మెసేజింగ్​ను మరింత యూజర్​ ఫ్రెండ్లీ చేసేలా మరో అద్భుతమైన ఫీచర్​ను మన ముందుకు తీసుకురానుంది.

అదేంటంటే 'వాట్సాప్​ చాట్​ థ్రెడ్'​ ఫీచర్.ఈ ఫీచర్​ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇకపై యూజర్లు తమ సమస్యలను వాట్సాప్​కు సులభంగా నివేదించవచ్చు.

అంతేకాక సమస్యలను తెలియ చేసిన కేవలం 48 గంటల్లోనే సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు.

​ ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది బీటా యూజర్స్​కు మాత్రమే అందుబాటులో ఉన్నది.

రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్​ యూజర్స్​ అందరికీ పరిచయం చేస్తామని వాట్సాప్​ స్పష్టం చేసింది.

ఒకవేళ మీరు వాట్సాప్ బీటా యూజర్ అయితే వాట్సాప్​ బీటా వెర్షన్​ను అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది.

తద్వారా మీకు కూడా వాట్సాప్​ థ్రెడ్​ ఫీచర్​ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.ఈ ఫీచర్​ మీకు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు వాట్సాప్ సెట్టింగ్స్​లోకి వెళ్లి, హెల్ప్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి.

దానిలో కాంటాక్ట్​ అజ్ అనే ఆప్షన్​ఫై క్లిక్​ చేయండి.మీకు ఒకవేళ వాట్సాప్ చాట్ థ్రెడ్‌ యాక్సెస్​ ఉంటే, అక్కడ ఒక డైలాగ్​ బాక్స్​ కన్పిస్తుంది.

లేదంటే ఎటువంటి డైలాగ్​ బాక్స్​ కన్పించదు.మీకు ఫీచర్​ అందుబాటులో ఉంటే దానిలో మీరు ఎదుర్కొంటున్న టెక్నికల్​ సమస్యను నమోదు చేయాలి.

అనంతరం మీరు థ్రెడ్‌ను ప్రారంభించగానే వాట్సాప్ మీ సమస్యకు పరిష్కారాన్ని గ్రూప్ చాట్‌లో చూపిస్తుంది.

మీ డివైజ్​ సమాచారం, ఇతర టెక్నికల్​ వివరాల యాక్సెస్​ కోసం పర్మిషన్​ అడుగుతుంది.

ఈ సమాచారాన్ని వాట్సాప్​తో పంచుకోవాలా? లేదా? అనే ఆప్షన్​ కూడా ఇస్తుంది.ఈ ఫీచర్​ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్​ పరికరాల్లో మాత్రమే రోల్​ అవట్​ అవుతోంది.

రాబోయే రోజుల్లో అందరికి అందుబాటులోకి వస్తుందట.!!.

దొండ‌కాయ తింటే మ‌తిమ‌రుపు వ‌స్తుందా.. అస‌లు ఇందులో నిజ‌మెంత‌..?