2023 వరల్డ్‌కప్‌లో ఆ మెయిన్ ప్లేయర్‌కి చోటు ఇవ్వని గంభీర్..

వన్డే వరల్డ్ కప్ 2023 అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కానుంది.ఇంకా చాలా రోజులు ఉన్న నేపథ్యంలోనే ఈ వరల్డ్‌కప్‌కు సంబంధించి అనేక వార్తలు హల్చల్ చేస్తున్న.

ఈ ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌కి భారతదేశ వేదికగా నిలవనుంది.దాంతో ఈ ప్రపంచకప్‌లో ట్రోఫీ ఎలాగైనా సాధించాలనే ఒత్తిడి టీమిండియాపై పెరుగుతోంది.సొంత గడ్డపై వరల్డ్ కప్ టైటిల్ గెలిస్తే వచ్చే రెస్పెక్ట్ వేరు కాబట్టి మెయిన్ టీమ్ ప్లేయర్స్ కూడా తమల తాము గొప్పగా సిద్ధం చేసుకుంటున్నారు.2011 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించింది కానీ ఆ తర్వాత టైటిల్‌ను గెలుచుకున్న గెలుచుకున్న దాఖలాలు లేవు.

అయితే 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో ఉన్న మాజీ ఇండియన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ 2023 ప్రపంచ కప్ గురించి చాలా వ్యాఖ్యలు చేస్తున్నాడు.ముఖ్యంగా ప్లేయర్ల ఎంపిక విషయంలో అతడు అధికంగా కామెంట్స్ చేస్తున్నాడు.

తాజాగా గంభీర్ టీమిండియాకి నలుగురు స్పిన్నర్లను సెలెక్ట్ చేశాడు కానీ బాగా అనుభవం ఉన్న, స్టార్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను మాత్రం దూరం పెట్టాడు.ఈ ప్లేయర్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ లను వన్డే వరల్డ్ కప్ కోసం తీసుకున్నాడు.

Telugu Cup, Cricket, Cricket Cup, Gautam Gambhir, India Spinners-Latest News - T

వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ రెగ్యులర్‌గా ఆటలు ఆడేవారు కాదు.ఇక రవి బిష్ణోయ్ ఒక యువ స్పిన్నర్.అతను ఇప్పటివరకు జట్టు తరఫున ఒకే ఒక వన్డే ఆడాడు.అలాంటిది అతడిని గంభీర్‌ ఎంపిక చేసుకోవడం ఇప్పుడు అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

Telugu Cup, Cricket, Cricket Cup, Gautam Gambhir, India Spinners-Latest News - T

ఐతే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.రీసెంట్‌గా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ బోలింగ్‌తో ప్రత్యర్థులను వణికించాడు.ఆపై శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో మూడు వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపించాడు.కుల్దీప్ యాదవ్‌కి తనకు ఎప్పుడు అవకాశం ఇచ్చిన తన ప్రతిభ చూపిస్తాడు.

అక్షర్ పటేల్ బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తా చాటగలడు.సో వీరిని ఎంపిక చేయడంలో గంభీర్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube