అంచనాలు తల కిందులయ్యాయి

చాలా కాలం తర్వాత రాజశేఖర్‌ నటించిన ‘గడ్డం గ్యాంగ్‌’ నిన్న రిలీజ్‌ అయిన విషయం తెల్సిందే.తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘సూదుకవ్వం’ చిత్రానికి ఇది రీమేక్‌.

 Gaddam Gang Movie Got Negative Talk..?-TeluguStop.com

ఈ సినిమా కూడా తెలుగులో భారీ విజయాన్ని సాధించడం ఖాయం అంటూ వార్తలు వచ్చాయి.అయితే అనూహ్యంగా ఈ సినిమా ఫలితం తారు మారు అయ్యింది.

ఈ సినిమాలో తమిళ ఫ్లేవర్‌ ఎక్కువగా ఉందని, ఎంటర్‌టైన్‌మెంట్‌ లోపించిందంటూ విశ్లేషణలు వచ్చాయి.దాంతో విడుదలైన మొదటి రోజు ప్రేక్షకుల నుండి నెగిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

‘గడ్డం గ్యాంగ్‌’ తర్వాత రాజశేఖర్‌ రూటు మార్చుకుని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారబోతున్నట్లుగా ప్రకటించాడు.ఇప్పటికే ఆఫర్లు వచ్చినా కూడా సక్సెస్‌ లేక పోవడం వల్ల రాజశేఖర్‌ రూటు మారినట్లుగా ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు భావిస్తారు అనే ఉద్దేశ్యంతో వాటికి నో చెప్పాడు.

‘గడ్డం గ్యాంగ్‌’ సక్సెస్‌ అయిన తర్వాత ఇకపై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌ వేశాలు వేయాలనుకున్న రాజశేఖర్‌ అంచనాలు తారుమారు అయ్యాయి.మరి ఇప్పుడేం చేస్తాడు అనే ఆసక్తికర చర్చ ఫిల్మ్‌ వర్గాల్లో జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube