తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ నలుగురు మెదక్ జిల్లాకు చెందిన వాళ్లే.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్),( Sunitha Laxmareddy ) కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక),( Kotha Prabhakar Reddy ) గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు),( Gudem Mahipal Reddy ) మాణిక్ రావు (జహీరాబాద్)( Manik Rao ) కలవడం జరిగింది.
ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.ఇదే సమయంలో తమ నియోజకవర్గాలలో సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.మొన్నటి వరకు దావోస్( Davos ) పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి నేడే హైదరాబాద్ తిరిగి వచ్చారు.
దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని( BRS Party ) 100 మీటర్ల లోతుల పాతి పెడతామని అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో 39 మంది ఎమ్మెల్యేలు 39 ముక్కలవుతారని వ్యాఖ్యానించారు.అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో ( Congress ) టచ్ లో ఉన్నారని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పదిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కావటం సంచలనంగా మారింది.