రామన్నపేట పెద్ద చెరువు నింపాలని మత్స్యకారులు ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లా: ధర్మారెడ్డిపళ్లి కాలువకు పీడర్ ఛానల్ ఏర్పాటు చేసి,దాని ద్వారా రామన్నపేట పెద్దచెరువును నింపాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ( Yadadri Bhuvanagiri District )రామన్నపేట మండల కేంద్రంలో మత్స్యకారులు, రైతుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కందుల హనుమంతు, కార్యదర్శి పిట్టల మచ్చగిరి మాట్లాడుతూ రామన్నపేట మీదుగా కొమ్మాయిగూడెం దిగువ ప్రాంతమైన చిట్యాల మండలాలకు నీళ్లు తరలించడం వలన రామన్నపేట ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

 Fishermen Are Worried About Filling The Big Pond In Ramannapet, Fishermen, Yadad-TeluguStop.com

ఇప్పటికే వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోవడం వలన బోరు బావులు ఎండిపోయి ఇక్కడ రైతులు,కూలీలు వలసలు పోయే పరిస్థితి దాపురిస్తుందని వాపోయారు.

ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులు,ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని రామన్నపేట పెద్ద చెరువుకు పీడర్ చానెల్ ఏర్పాటు చేసి ఇక్కడ చెరువు కుంటలను నింపి రైతులను,కూలీలను మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పెద్దబోయిన మీనమ్మ,మాజీ డైరెక్టర్ బచ్చ రాములు, లింగస్వామి,జింకల చిన్నరాములు,మహిళా మత్స్యకారులు భాగ్యమ్మ, అనసూయ,నర్సమ్మ,ఇందిరా,కందుల రాములమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube