ఈమధ్య పూజ హెగ్డే( Pooja Hegde ) పేరు వింటేనే జనాలు భయపడిపోతున్నారు.ఒకప్పుడు ఈమెను అభిమాన హీరోయిన్ గా చూసుకున్న వాళ్లే ఇప్పుడు వద్దు రా బాబు అంటున్నారు.
కారణమేంటంటే గత కొంతకాలం నుంచి ఈమె ఐరన్ లెగ్ గా మారింది.అయితే ఇండస్ట్రీకి తొలిసారిగా 2010 లో అడుగుపెట్టిన పూజా.2014లో ముకుంద సినిమా( Mukunda movie )తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
మొదట్లో వరుస ఫ్లాప్ లను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.
ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంది.ఇక ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా కచ్చితంగా మంచి సక్సెస్ అందుకోవడం ఖాయమని ఒకప్పుడు దర్శక నిర్మాతలు ఆమెను ఓ రేంజ్ లో ఎత్తారు.
పైగా ఆ సమయంలో అలా వైకుంఠపురంలో( ala Vaikunthapuram lo ) నటించి సక్సెస్ అందుకోవటంతో చాలామంది దర్శక నిర్మాతలు ఈమెకు తమ సినిమాలలో బాగా అవకాశాలు ఇచ్చారు.అలా వరుసగా అవకాశాలు అందుకోగా వరుసగా ప్లాప్ లు అందుకొని నిరాశ చెందింది.
అది కూడా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలోనే ఫ్లాపులు ఎదుర్కొంది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, ఆచార్య ఇలా వరుస సినిమాలు బాగా నిరాశపరిచాయి.
ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా వరుస సినిమాలు చేయగా అక్కడ కూడా ప్లాప్ అందుకుంది.దీంతో ఇప్పుడు సక్సెస్ కోసం బాగా ఎదురుచూస్తుంది.కానీ దర్శక నిర్మాతలు ఈమెను పక్కకు పెట్టేసారు.ఇకపై ఈమెకు అవకాశాలు కూడా రావడం కష్టమే అన్నట్టుగా ఉంది.తమ అభిమాన హీరోల సినిమాలు నిరాశపరిచినందుకు ఈమెపై బాగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అభిమానులు.
ఐరన్ లెగ్( Iron leg ) అంటూ మరోసారి ముద్రవేశారు.ఇక ఈ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది.
తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.
చాలావరకు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.ఓ అభిమాని తనను ఫుల్ యాక్షన్ మూవీలో చూడాలి అని కోరిక ఉందని అనటంతో వెంటనే పూజ హెగ్డే త్వరలోనే అని సమాధానం ఇచ్చింది.
దీంతో ఆ స్టోరీ చూసి మరోసారి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.ఇప్పటివరకు చేసింది చాలు.ఇంకా ఫుల్ యాక్షన్ మూవీసా అంటూ.వద్దమ్మా దయచేసి ఇటువంటివి పనులు చేయకు అంటూ ఆమెకు దండం పెడుతున్నారు.