Chiranjeevi Padma Vibhushan: పద్మవిభూషణ్ దక్కించుకున్న చిరంజీవికి ఎన్ని సదుపాయాలు లభిస్తాయో తెలుసా ?

చిరంజీవికి( Chiranjeevi ) పద్మ విభూషణ్ దక్కింది దాంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

చిరంజీవితో పాటు మరో ఒక తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడు( Venkaiah Naidu ) సైతం ఈ అవార్డు అందుకుంటున్నారు.

ఇద్దరు తెలుగువారికి ఈ అవార్డు దక్కడం నిజంగా తెలుగు వారందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు.ఇక భారత దేశం ఇచ్చే రెండవ అత్యున్నత అవార్డుగా పద్మ విభూషణ్ నీ( Padma Vibhushan ) చెప్పుకోవచ్చు.

పైగా ఏదైనా ఒక రంగంలో ఎనలేని సేవ చేసిన వారికి మాత్రమే ఈ పద్మ విభూషణ్ లభిస్తుంది.అటు రాజకీయాల్లో వెంకయ్య నాయుడుకి ఇటు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ఈ అవార్డు లభించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు గర్వించే విషయం.

ఇక చిరంజీవి అభిమానుల సంబరాలు మిన్నంటుతున్నాయి నిన్నటి నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సెలబ్రిటీలు అభిమానులు సందడి చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుతున్నారు.చాలామంది సెలబ్రిటీలు( Celebrities ) నేరుగా ఆయన నివాసానికి చేరుకొని మరి చిరంజీవిని అభినందిస్తున్నారు.

Advertisement

ఇక అసలు విషయంలోకి వెళితే పద్మ విభూషణ్ లభించిన వారికి ముఖ్యంగా చిరంజీవి లాంటి ఒక సెలబ్రిటీకి ఎలాంటి సదుపాయాలు దక్కుతాయి అనే విషయంలో చాలా అపోహలు నెలకొని ఉన్నాయి.దేశంలోనే ఇంతటి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న వారికి దక్కే సదుపాయాల విషయంలో క్లారిటీ గా వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిజానికి చిరంజీవికి ఈ అవార్డు( Award ) ప్రకటించిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.బస్సులలో, రైళ్లలో అలాగే విమానాల్లో కూడా ఆ చిరంజీవికి రాయితీలు లభిస్తాయి అంటూ చెబుతున్నారు.అంతే కాదు పెద్ద మొత్తంలో నగదు బహుమతి కూడా లభించే అవకాశం ఉంది అంటూ తెలుపుతున్నారు.

కానీ ఇందులో ఏ విషయం నిజం కాదు.పద్మ విభూషణ్ అందుకునే వారికి ఇలాంటి రాయితీలు లభించవు.

కేవలం రాష్ట్రపతి నీ( President ) నేరుగా కలిసి అవకాశం మాత్రమే దక్కుతుంది.అవార్డు అందుకునే సమయంలో రాష్ట్రపతి సంతకం చేసిన ఒక పత్రాన్ని చిరంజీవికి అందిస్తారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అంతకుమించి ఎలాంటి రాయితీలు కల్పించే అవకాశం లేదు.

Advertisement

తాజా వార్తలు