సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ గురించి మనలో ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది.యువత, విద్యార్థులు ఎక్కువగా ఫేస్ బుక్ ను వినియోగిస్తారు.
వాట్సాప్ తర్వాత యూత్ లో ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న యాప్ ఫేస్ బుక్ మాత్రమే.తాజాగా ఫేస్ బుక్ మన దేశంలోని ఒక యువకుడి ప్రాణాలను కాపాడింది.
సకాలంలో పోలీసులను అలర్ట్ చేసి తక్కువ సమయంలోనే ఫేస్ బుక్ యువకుడి ప్రాణాలు నిలబడేలా చేసింది.
పశ్చిమ్ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన ఒక యువకుడు కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగాన్ని కోల్పోయాడు.
ఉద్యోగం లేకపోవడం, ఖర్చులకు సరిపడే మొత్తంలో డబ్బు చేతిలో లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు.ఏం చేయాలో పాలుపోని యువకుడు తాను బ్రతికి సాధించేది లేదని చనిపోవడమే సరైన మార్గమని భావించాడు.
తాను చనిపోవాలనుకున్న విషయం ఇతరులకు తెలియాలని ఫేస్ బుక్ లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
అయితే ఫేస్ బుక్ సిబ్బంది యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున పోస్ట్ ను వెంటనే గుర్తించారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు సకాలంలో స్పందించి యువకుడి ఫోన్ ద్వారా లొకేషన్ ను గుర్తించి ఆత్మహత్యాయత్నాన్ని ఆపడంలో సక్సెస్ అయ్యారు.సమయస్పూర్తితో వ్యవహరించి యువకుడి ఆత్మహత్యను ఆపడంలో సక్సెస్ అయిన ఫేస్ బుక్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నాడియా జిల్లాలోని భీంపూర్ కు చ్నె్దిన యువకుడు సోమవారం 1.30 గంటల సమయంలో ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ ఈ మెయిల్ ద్వారా ఫేస్ బుక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు యువకుడి తండ్రికి సమాచారం ఇచ్చి కుమారుడిని కాపాడుకున్నాడు.మణికట్టుపై కత్తితో కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది.