కేసీఆర్ అత్యవసర మీటింగ్ ? జెండా అజెండా ఇదే ?

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుండడం ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.చాపకింద నీరులా తెలంగాణలో బిజెపి బలపడడం , ఏకంగా టిఆర్ఎస్ పార్టీని ఓడించి ఈ స్థాయికి ఎదగడం ఇవన్నీ కేసీఆర్ కు మింగుడు పడడం లేదు.

 Cm Kcr To Hold Emergency Cabinet Meeting, Telangana Cm Kcr, Emergency Cabinet Me-TeluguStop.com

అసలు ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు.అసలు తప్పు ఎక్కడ జరిగింది ? ఏ లోపాలు కారణంగా ఓటమి చెందవలసి వచ్చిందనే విషయంపై క్లారిటీ తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే నేడు అందుబాటులో ఉన్న కొంత మంది మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ఎన్నో అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి కి గల కారణాలతో పాటు, త్వరలో జరగబోతున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎదురు లేకుండా ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన కెసిఆర్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.ముఖ్యంగా ఈ సమావేశంలో బిజెపి ఏవిధంగా బలం పుంజుకుంది అనే విషయం పైన లోతుగా చర్చించబోతున్నట్లు సమాచారం.

దీంతోపాటు జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు తిరుగులేకుండా చేసుకునేందుకు ఏం చేయాలనే విషయంపైనా మంత్రులతో చర్చించబోతున్నట్లు సమాచారం.

Telugu Dubbaka, Emergency, Ghmc, Ragunandan Rao, Telanagana, Trs-Latest News - T

ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన గెలుపు కిక్కు తో బీజేపీ దూకుడుగా ఉంటుందని, ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, ఆ ప్రభావం తప్పనిసరిగా గ్రేటర్ ఎన్నికలపై పడుతుందని, అందుకే బిజెపికి చాన్సు లేకుండా చేసుకునేందుకు పార్టీపరంగా ఏమి చేయాలనే విషయంపైనా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లు సమాచారం.అలాగే ఇటీవల వరదల కారణంగా పంపిణీ చేసిన నగదు సాయం లో అవినీతి చోటు చేసుకున్నట్లుగా ప్రతిపక్షాలు పదే పదే ప్రచారం చేసి, ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపించాయి అని, ఇకపై అటువంటి తప్పిదాలు జరగకుండా ఏ విధంగా చేయాలి అనే విషయం పైన సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.దీంతో పాటు మరో రెండు రోజుల్లో మొత్తం మంత్రి మండలి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా కెసిఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube