యువకులే కాదు.తాము కూడా డ్యాన్స్‌లతో( Dance ) అదరగొట్టగలమని చాటి చెబుతోంది ఒక వృద్ధ జంట.
( Elderly Couple ) తమకు ఎవరు చాటి అని అంటోంది.ఇటీవల పాటలను రీక్రియేట్ చేసే ట్రెండ్ వచ్చింది.
పాటలకు కొత్త రకంలో డ్యాన్స్ వేస్తూ తమ క్రియేటివిటీని కొంతమంది బయటపెడుతున్నారు.యువకులకు పోటీగా మహిళలు కూడా సాంగ్స్‌ను రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.అయితే తాజాగా ఒక వృద్ధ జంట ఒక సాంగ్‌ని రీక్రియేట్ చేసి ట్రెండింగ్ సృష్టిస్తోంది.
1979లో విడుదల అయిన మంజిల్ సినిమాలోని రిమ్ జిమ్ గిరే సావన్ ( Rimjhim Gire Sawan )అనే పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ పాట అప్పట్లో సూపర్ హిట్ అయి ఎంతోమంది మ్యూజిక్ ప్రియుల మనస్సులను గెలుచుకుంది.ఈ పాటను వర్షంలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక వృద్ధ జంట అద్భుతంగా క్రియేట్ చేసింది.
ఈ పాటలో తమ డ్యాన్స్ లతో వృద్ధ జంట ఆకట్టుకుంటోంది.
దీనికి సంబంధించిన వీడియో గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతుండగా.తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థ సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) తన ట్విట్టర్ లో షేర్ చేశారు.తాను ఈ జంటను అభినందిస్తున్నానని, మీరు మీలోని ఊహశక్తిని బయటకు తీస్తే మీరు కోరుకున్న జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చని వ్యాఖ్యానించారు.
ఈ వీడియోలో కనిపించిన జంట పేరు శైలేష్ ఇనామ్ దార్, వందనగా తెలుస్తోంది.వృద్ధ జంట సాంగ్ రీక్రియేట్ చేస్తుండగా.వారి స్నేహితులు అనూప్ రింగంగావర్కర్, అతడి భార్య అంకిత షూట్ చేశారు.అయితే ఓరిజినల్ సాంగ్ లో అమితాబ్ బచ్ చన్, మౌసమి ఛటర్జీలు హీరోహీరోయిన్లుగా నటించారు.
అరుణ్ పనికర్ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్ గా మారింది.