సీటు ఇచ్చేది ఎప్పుడు పోటీ చేసేది ఎప్పుడు? ఆశావహుల్లో తీవ్ర స్థాయికి చేరుతున్న అసంతృప్తి!

తెలంగాణ ఎన్నికలకు( Telangana Elections ) సంబంధించి అధికార బారాస ఇప్పటికే పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించి ప్రచార జోరులో ముందుకు దూసుకెళ్లిపోతుంటే కాంగ్రెస్, భాజపాల నుంచి మాత్రం ఇంకా కొన్ని స్థానాలు సస్పెన్స్ లోనే ఉంచడంతో ఆయా సీట్లు ఆశిస్తున్న అభ్యర్థుల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుతుంది .అసలు సీట్ ఇస్తారా లేదా ఇస్తే ఎప్పుడు ఇస్తారు? మేము ఏప్పుడు ప్రచారానికి ఎప్పుడు వెళ్లాలంటూ వారు తమ తమ అధిష్టానాల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.కాంగ్రెస్( Congress Party ) ప్రస్తుతానికి నాలుగు స్థానాలను సస్పెన్స్ లో పెట్టింది.తుంగతుర్తి, మిర్యాలగూడ, సూర్యాపేట, చార్మినార్ నియోజకవర్గాల కు అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు.

 Dissatisfaction Among Bjp Congress Party Leaders For Not Declaring Candidates De-TeluguStop.com

దాంతో ఆయా స్థానాలను ఆశిస్తున్న ఆశావహులు గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.

Telugu Bjpjanasena, Congress, Janasena, Kishan Reddy, Revanth Reddy-Telugu Polit

ఆ బీఫార్మ్ ఏదో ఇచ్చేస్తే తమ పాట్లు తాము పడతామని కీలక నాయకులకు విన్నవించుకుంటున్నారట.మరోపక్క భారతీయ జనతా పార్టీ( BJP ) కూడా దాదాపు 11 స్థానాల వరకూ అభ్యర్థులను ప్రకటించలేదు అందులో రెండు స్థానాలలో భాగస్వామ్య పక్షం జనసేనకు, భాజపాకు( Janasena BJP ) మధ్య పొత్తు చర్చలు కొలిక్కి రాక ప్రతిష్టoభన ఏర్పడగా మిగిలిన 9 స్థానాలలో ఒకటి కన్నా ఎక్కువ అభ్యర్థులు ఉండటంతో లెక్కలు ఎంతకూ తేలడం లేదట.అయితే ఇప్పుడు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆయా స్థానాలలో టికెట్స్ ఆశిస్తున్న అభ్యర్థులకు పల్స్ రేటు పెరిగిపోతున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Bjpjanasena, Congress, Janasena, Kishan Reddy, Revanth Reddy-Telugu Polit

ఏది ఏమైనా ఇప్పటికే అధికార బారాస( BRS ) గుర్తుపై పోటీ చేస్తున్న నేతలు సగం ప్రచారాన్ని పూర్తి చేసేసుకున్నారు.దాంతో ఇప్పుడు ఉన్న ఈ తక్కువ సమయంలో ప్రచారంలో ఎలా ముందుకెళ్లలో తెలియక ఆయా నేతలు తలలు పట్టుకుంటున్నారట.రేపు సాయంత్రం వరకు మిగిలి ఉన్న అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారు అవుతారని తెలుస్తుంది.చివరి నిమిషపు గోడ దూకుడులను అరికట్టేందుకే పార్టీలు ఈ ఫార్ములాను ఉపయోగిస్తున్నాయన్న వాదనలు కూడా లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube