సీటు ఇచ్చేది ఎప్పుడు పోటీ చేసేది ఎప్పుడు? ఆశావహుల్లో తీవ్ర స్థాయికి చేరుతున్న అసంతృప్తి!

తెలంగాణ ఎన్నికలకు( Telangana Elections ) సంబంధించి అధికార బారాస ఇప్పటికే పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించి ప్రచార జోరులో ముందుకు దూసుకెళ్లిపోతుంటే కాంగ్రెస్, భాజపాల నుంచి మాత్రం ఇంకా కొన్ని స్థానాలు సస్పెన్స్ లోనే ఉంచడంతో ఆయా సీట్లు ఆశిస్తున్న అభ్యర్థుల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుతుంది .

అసలు సీట్ ఇస్తారా లేదా ఇస్తే ఎప్పుడు ఇస్తారు? మేము ఏప్పుడు ప్రచారానికి ఎప్పుడు వెళ్లాలంటూ వారు తమ తమ అధిష్టానాల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

కాంగ్రెస్( Congress Party ) ప్రస్తుతానికి నాలుగు స్థానాలను సస్పెన్స్ లో పెట్టింది.

తుంగతుర్తి, మిర్యాలగూడ, సూర్యాపేట, చార్మినార్ నియోజకవర్గాల కు అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు.

దాంతో ఆయా స్థానాలను ఆశిస్తున్న ఆశావహులు గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. """/" / ఆ బీఫార్మ్ ఏదో ఇచ్చేస్తే తమ పాట్లు తాము పడతామని కీలక నాయకులకు విన్నవించుకుంటున్నారట.

మరోపక్క భారతీయ జనతా పార్టీ( BJP ) కూడా దాదాపు 11 స్థానాల వరకూ అభ్యర్థులను ప్రకటించలేదు అందులో రెండు స్థానాలలో భాగస్వామ్య పక్షం జనసేనకు, భాజపాకు( Janasena BJP ) మధ్య పొత్తు చర్చలు కొలిక్కి రాక ప్రతిష్టoభన ఏర్పడగా మిగిలిన 9 స్థానాలలో ఒకటి కన్నా ఎక్కువ అభ్యర్థులు ఉండటంతో లెక్కలు ఎంతకూ తేలడం లేదట.

అయితే ఇప్పుడు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆయా స్థానాలలో టికెట్స్ ఆశిస్తున్న అభ్యర్థులకు పల్స్ రేటు పెరిగిపోతున్నట్లుగా తెలుస్తుంది.

"""/" / ఏది ఏమైనా ఇప్పటికే అధికార బారాస( BRS ) గుర్తుపై పోటీ చేస్తున్న నేతలు సగం ప్రచారాన్ని పూర్తి చేసేసుకున్నారు.

దాంతో ఇప్పుడు ఉన్న ఈ తక్కువ సమయంలో ప్రచారంలో ఎలా ముందుకెళ్లలో తెలియక ఆయా నేతలు తలలు పట్టుకుంటున్నారట.

రేపు సాయంత్రం వరకు మిగిలి ఉన్న అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారు అవుతారని తెలుస్తుంది.

చివరి నిమిషపు గోడ దూకుడులను అరికట్టేందుకే పార్టీలు ఈ ఫార్ములాను ఉపయోగిస్తున్నాయన్న వాదనలు కూడా లేకపోలేదు.

వైరల్ వీడియో: ఇకపై నోట్స్ రాయడాలకు చెక్ పడినట్లేనా..?