అన్ని మంచి శకునములు…( Anni Manchi Sakunamule ) అందరు అనుకున్నట్టుగానే సినిమా థియేటర్ లోకి మంచి శకునములతోనే వచ్చింది.ఒక పెద్ద ప్రొడక్షన్ సంస్థ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు.
ఆ తర్వాత తీయబోయే సినిమా కూడా ముందు వాటి కన్నా మించింది అయి ఉంటుంది అని జనాలు ఊహించారు.అందరు ఊహలను నిజం చేస్తూ నటన ఏంటో తెలిసిన శోభన్ ని( Santosh Shoban ) హీరో గా, తనదైన రోజు వస్తే అదరగొట్టగల నటి మాళవిక హీరోయిన్ గా, షావుకారు జానకి,వాసంతి, గౌతమి వంటి సీనియర్స్ ని తీసుకొని, ఎలాంటి మాఫియా, చేతబడులు, ఫైట్స్, కమర్షియల్ హంగుల హడావిడి లేకుండా సినిమా పూర్తి చేసి థియేటర్ లో వదిలారు.
ఇక ఓ మై బేబీ అంటూ గతంలో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా తో హిట్ కొట్టిన నందిని రెడ్డి( Director Nandini Reddy ) ఈ సారి కూడా హిట్ ఇస్తుందని భావిస్తే అసలుకే మోసం వచ్చింది.వ్యాపార విలువలు తెలిసిన వైజయంతి మూవీస్ కోట్లు రూపాయలు ఖర్చు పెట్టె పరిస్థితిలోనే ఉన్న కూడా నాసిరకం కథ ఎన్నుకొని ఆసాంతం సినిమా పాత చింత కాయ పచ్చడి లా చేసి పెట్టింది నందిని రెడ్డి. ఈ సినిమా ఖచ్చితంగా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోవడం ఖాయం.అయితే ఈ సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత డైరెక్టర్ ది మాత్రమే.ఇప్పటికే పిల్లలను పుట్టగానే కాసెప్ట్ తో అల్లు అర్జున్ సినిమా తీయగా అక్కడే పెద్ద బోల్తా కొట్టేసింది సినిమా.
అచ్చం అదే పాయింట్ తో మొదలవ్వడం వల్ల సగం దెబ్బ కొట్టేసింది.ఇక సంగీతం గురించి ఎంత చెప్పుకున్న టైం వేస్ట్.ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుండే పాట కానీ ట్యూన్ కానీ లేవు.
ఇక ఎంతో కొంత హీరోయిన్ కి స్క్రీన్ పైన స్పేస్ దొరికింది కానీ హీరో కు మాత్రం అది కూడా దొరకలేదు.శోభన్ కి ఇప్పటికి కెరీర్ గాడి లో పడలేదు.
అర్జెంటు గా ఒక హిట్ కొడితే తప్ప అతడిని జనాలు గుర్తుంచుకునే పరిస్థితి లేదు.ఇక ఈ సారి కూడా అతడికి పెద్ద నిరాశ మాత్రమే మిగిలింది.
మిగతా పెద్ద తారాగణం అంతా కూడా ఎవరి పాత్రల మేరకు వారు బాగానే చేసారు.కానీ ఎటొచ్చి కథ దగ్గరే మార్కులు పడలేదు.
వెరసి చాల రోజుల తర్వాత వైజయంతి మూవీస్ కి ప్లాప్ పడింది.