దేశానికే దిక్చూచిగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి.. సీఎం జగన్

ఏపీ రాష్ట్ర అభివృద్ధి దేశానికే దిక్చూచిగా మారిందని సీఎం జగన్ అన్నారు.పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనలో భాగంగా జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించనున్నారు.

 Development Of Ap State As The Direction Of The Country.. Cm Jagan-TeluguStop.com

11.43 శాతం గ్రోత్ రేట్ తో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందని జగన్ తెలిపారు.ఈ క్రమంలోనే సొంత షాపు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం చేదోడుగా నిలుస్తోందని చెప్పారు.దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.3.30 లక్షల మందికి రూ.330 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.

గత మూడేళ్లలో ఒక్క చేదోడు పథకం ద్వారానే రూ.927 కోట్ల సాయం చేశామని పేర్కొన్నారు.అదేవిధంగా రూ.లక్షా 97 వేలను అక్కాచెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేశామన్నారు.ఎక్కడా లంచాలు లేకుండా పథకాలను పారదర్శకంగా అందిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube