వీరసింహారెడ్డి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయినా బాలయ్య అభిమానులకు, మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చింది.అయితే ఈ సినిమాను తాజాగా చూసిన రజనీకాంత్ ఈ మూవీ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.
వీరసింహారెడ్డి సినిమా చూసి రజనీకాంత్ ఫిదా అయ్యారని బోగట్టా.
తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.రజనీకాంత్ గారు ఈ సినిమా చూశారని ఈ సినిమా ఆయనకు నచ్చిందని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు.
నా సినిమాకు రజనీకాంత్ నుంచి ప్రశంసలు రావడం సంతోషం కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు.ఆయన అనుభవించిన ఎమోషన్స్ నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ అని గోపీచంద్ మలినేని తెలిపారు.
వీరసింహారెడ్డి రీమేక్ లో రజనీకాంత్ నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.రజనీకాంత్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రజనీకాంత్ కు ప్రస్తుతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం ఉంది.రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య రజనీకాంత్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.రజనీకాంత్ ఒక్కో సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది.
రజనీకాంత్ వయస్సుకు తగిన రోల్స్ ను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.