దేశానికే దిక్చూచిగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి.. సీఎం జగన్
TeluguStop.com
ఏపీ రాష్ట్ర అభివృద్ధి దేశానికే దిక్చూచిగా మారిందని సీఎం జగన్ అన్నారు.పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనలో భాగంగా జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించనున్నారు.
11.43 శాతం గ్రోత్ రేట్ తో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందని జగన్ తెలిపారు.
ఈ క్రమంలోనే సొంత షాపు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం చేదోడుగా నిలుస్తోందని చెప్పారు.
దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.3.
30 లక్షల మందికి రూ.330 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
గత మూడేళ్లలో ఒక్క చేదోడు పథకం ద్వారానే రూ.927 కోట్ల సాయం చేశామని పేర్కొన్నారు.
అదేవిధంగా రూ.లక్షా 97 వేలను అక్కాచెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేశామన్నారు.
ఎక్కడా లంచాలు లేకుండా పథకాలను పారదర్శకంగా అందిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.
ఈ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ పరార్..!