పరిసరాల పరిశుభ్రతతో డెంగీ నివారణ:- ఆర్టీసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎ.వి.గిరిసింహారావు

పరిసరాల్లో నిలువవుండే నీటిని తరచూ తొలగించుకోవాలని,పూలకుండీలు,పాతటైర్లు, కూలర్లు,నీటితొట్లు వీటిలో నీటిని నిలువ ఉంచకూడదని,పగటిపూట కుట్టే దోమల వల్ల డెంగీ జ్వరం ప్రబలే అవకాశం వుందని, బస్టాండ్ లాంటి ప్రజాసమూహ ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వుందని ఆర్టీసీ ప్రాంతీయ వైద్యాధికారి డాక్టర్ ఎ.వి.

 Dengue Prevention With Environmental Hygiene: - Rtc Senior Medical Officer Dr. A-TeluguStop.com

గిరిసింహారావు(గిరీష్)తెలిపారు.సోమవారం ఉదయం ఖమ్మం నూతన బస్టాండ్ ఆవరణలో “డెంగ్యూ నివారణదినం” పురష్కరించుకొని ఆర్టీసీ సిబ్బందికీ, ప్రయాణికులకూ డాక్టర్ గిరిసింహారావు అవగాహన కల్పించారు.

డెంగీ నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కరపత్రాలని పంపిణీ చేశారు.వేసని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ పాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ డి.శంకర్రావు,అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) టి.స్వామి,స్టేషన్ మేనేజర్ రఘుబాబు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్యామ్,ఆర్టీసీ సెక్యూరిటీ సబ్ఇన్స్పెక్టర్ హన్మంతు,కానిస్టేబుల్ అస్లాంపాషా,కంట్రోలర్ చుట్టకుదుళ్ళ రఘు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube