ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ టియుడబ్ల్యుజె ఖమ్మం నియోజకవర్గ మహాసభ నగరంలోని డిపిఆర్ భవన్ లో ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నార్వనేని వెంకట్రావు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాం నారాయణ ఆధ్వర్యంలో టియుడబ్ల్యుజై ఖమ్మం నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు.
టియుడబ్ల్యుజై ఐజెయు ఖమ్మం నియోజకవర్గ కమిటీ అధ్యక్షులుగా మైసా పాపారావు(ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శి గా చెరుకుపల్లి శ్రీనివాస్ రావు(99టివి),ఉపాధ్యక్షులుగా శీలం శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ) రాంబాబు(ప్రజాపక్షం),రాము(ఆంధ్రజ్యోతి),కోశాధికారిగా రాయల బసవేశ్వర్ రావు(విశాలాంధ్ర),సహాయ కార్యదర్శులుగా ఉపేందర్ (సాక్షి),సంపత్(ఎబిఎన్ ఆంధ్రజ్యోతి),శ్రీధర్ (టివి9),కార్యవర్గ సభ్యులుగా వేణుగోపాల్,కమటం శ్రీనివాస్, కొత్తూరు రమేశ్, రాము, వినయ్ ,కొమ్మినేని ప్రసాద్, కట్టకొల నాగార్జున,ఉమేశ్, విజయ్ సాగర్ రెడ్డి, మహిళా ప్రతినిధి మధులత లను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా జర్నలిస్టులకు సంబంధించిన పలు సమస్యలపై తీర్మాణలను ప్రతిపాదించగా మహాసభ అమోదించింది.