రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ టోకరా..భార్యాభర్తలు అరెస్ట్

నగరంలోని సుగ్గలవారి తోట ప్రాంతానికి చెందిన దాసరి సరిత అనే మహిళ తమ వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రు 36 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిందని ఖమ్మం నగరంలోని చెరువు బజారుకు చెందిన పాలవెల్లి తులసి మరియు డౌలే సునీత పోలీస్ కమిషనర్ విష్ణు యస్.

వారియర్ గారిని కలసి ఫిర్యాదు చేశారు.

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దాసరి సరితపై ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సిఐ సమగ్ర విచారణ జరిపి సదరు దాసరి సరిత మరియు తన భర్త అయిన జన్నారం గ్రామం, ఏన్కూర్ మండలానికి చెందిన 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ముద్దం శ్రీశాంత 26సం,, (ప్రస్తుత పోస్టింగ్ తల్లాడ P.S) అనునతనితో కలిసి సదరు దాసరి సరిత రైల్వే డిపార్టుమెంట్ లో గేజిటేడ్ ఆఫీసర్ ఫేక్ ఐడి కార్డు తయారుచేసుకొని వారి బందువులకు, ఫ్రెండ్స్, మరియు ఇతరులకు రైల్వేలో వివిధ హోదాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మకం కలిగే విధంగా మాయమాటలు చెప్పి సుమారు 12 మంది బాధితుల వద్ద నుండి సుమారు 1, 88,95,000/- రూపాయలు వసూలు చేశారని, ఈవిధంగా మోసం చేసిన డబ్బుతో విలాసవంతమైన జీవనం గడుపుతూ., సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ స్థిర, చరాస్థలు తినుగోలు చేశారని సిఐ తెలిపారు.

ఇట్టి వాటిలో చాలా వరకు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు.నిందుతులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.

కానిస్టేబుల్ పై శాఖ పరమైన క్రమశిక్షణ చర్యలకు ప్రతిపాదన పంపనున్నట్లు సిఐ తెలిపారు.పి ఆర్ వో.

Advertisement
హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!

Latest Khammam News