ఖమ్మం జిల్లా( Khammam District) వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఆన్లైన్ సిస్టం తీసుకొచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తక్షణమే దానిని రద్దు చేయాలని విజప్తి చేస్తూ పిడి ఎస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా పి డి ఎస్ యు( PDSU) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జి మస్తాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ నందు ఆన్లైన్ సిస్టమ్స్ తీసుకొచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో కనపడుతుంది .
జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నింగికి నీరు లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం వస్తే పేద విద్యార్థుల బతుకులు మారుతాయి అనుకున్న కానీ హాస్టల్స్ లో చదువుకోవాలంటే సరిగా గదులు లేక అద్దె భవనాలలో చదువుకుంటూ విద్యార్థులు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది అద్దె భవనాలతో నడుపుతున్న వాటిని సొంత భవనాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులకు సంఖ్యకు అనుకూలంగా హాస్టల్ సీట్లను పెంచాలని వారు అన్నారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్య సంస్థలు కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటే ముఖ్యమంత్రి గారు బడా కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసిన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో కనపడతా ఉంది పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల( Govt Junior College )లో ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని హాస్టల్స్ చదువుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ సిస్టమ్స్ రద్దు చేయాలని విద్యార్థులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం.కార్యక్రమంలో.
సాగర్ రవి కృష్ణ ఆర్కే గోపి.పాల్గొన్నారు