తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్ద హీరోల సినిమాలు అంటే చాలా మంది ఫ్యాన్స్ ఆ సినిమాల మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ముఖ్యంగా ఆ సినిమా గురించి సినిమా అప్డేట్ల గురించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.ఇవన్నీ ఇలా ఉంటే ఒక్కొక్క సారి సినిమా టైటిల్ ని ( Movie Titles ) అఫీషియల్ గా అనౌన్స్ చేయక ముందే ఆ సినిమా టైటిల్ ఏంటి అనేది అందరికీ తెలిసిపోతుంది.
అలా చాలా సినిమా టైటిల్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి.ఎక్కువగా పెద్ద పెద్ద స్టార్ హీరోల టైటిల్స్ లీక్ అవుతూ ఉంటాయి…
ప్రేక్షకులకి సినిమా పేరు ముందే తెలిసిపోతుంది అయితే ఎలా సినిమా పేరు బయటికి వచ్చేస్తుంది.? అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకముందే సినిమా టైటిల్ ఎలా బయటకి వస్తుందనే సందేహం మీలో కలిగిందా.? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.ఎక్కువగా పెద్ద పెద్ద హీరో సినిమాల టైటిల్స్ లీక్ అవుతూ ఉంటాయి అఫీషియల్ అనౌన్స్మెంట్ కంటే ముందే టైటిల్స్ ప్రేక్షకులకి తెలిసిపోతాయి…

దీనికి గల కారణం ఏమిటనేది పరశురాం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.ఒక టైటిల్ ని అనుకుని దానిని టైటిల్ డిజైనింగ్ కోసం ఎడిటింగ్ కి పంపించినప్పుడు ఆ ఎడిటర్లు ఈ విషయాన్ని ఫ్రెండ్స్ కి లేదంటే ఎవరికైనా చెప్పొచ్చు.అలా ప్రేక్షకులకి తెలిసిపోతూ ఉంటుంది.చిన్న చిన్న హీరో టైటిల్స్ మీద పెద్దగా ఎవరు దృష్టి పెట్టరు కాబట్టి అటువంటివి లీక్ అవ్వవు పెద్ద పెద్ద హీరోల టైటిల్స్ వచ్చాయంటే చెప్పేస్తూ ఉంటారు…

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న బ్రో సినిమా( Bro Movie ) టైటిల్ కూడా అలానే లీక్ అయ్యింది.ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న దేవర సినిమా( Devara Movie ) టైటిల్ కూడా లీక్ అయింది.మహేష్ బాబు సర్కారు వారి పాట ( Sarkaru Vari Paata ) సినిమా టైటిల్ అనుకుని మహేష్ బాబు కి ఆ సినిమా టైటిల్ చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామనుకున్నారు కానీ మహేష్ బాబుకి ఈ విషయం తెలిసిపోయింది అఫీషియల్ అనౌన్స్మెంట్ కంటే ముందే ఈ టైటిల్ కూడా లీక్ అయిపోయింది.
ఇప్పుడు తాజాగా గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమా టైటిల్ కూడా లీక్ అయిపోయింది…
అయితే తెలుగు లో పెద్ద హీరోలకి ఉన్నంత క్రేజ్ వేరే ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండదు అందుకే వాళ్ల హీరో కి సంభందించిన అప్డేట్ మొదట నేనే తెలుసుకోవాలి అని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు…








