ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచెరువు లో ఈ నెల 7నుండి10 వరకు జాతీయ స్థాయి ఎద్దుల పోటీలను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటూరి శేఖర్ యూత్ నిర్వహించనున్నట్లు డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు.పార్టీలకు అతీతంగా పోటీలు నిర్వహిస్తున్నామని, పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతి బుల్లెట్ బండి, రెండవ బహుమతి,70 వేలు,మూడవ బహుమతి 60 వేలు ఇస్తున్నామన్నారు.10 వ తేదీ రాత్రి పులివెందుల పులిబిడ్డలు అనే సాంఘిక నాటకం శ్రీ నవ్య నాట్య మండలి కళాకారుల చే ఏర్పాటు చేశామని శేఖర్ తెలిపారు.పోటీలకు వచ్చిన వారికి భోజనం ఏర్పాటు కూడా చేశామన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.ఈ సమావేశంలో రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు,నేలకొండపల్లి మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య,మల్లీడి వెంకన్న,సర్పంచ్ కొండ సత్యం తదితరులు పాల్గొన్నారు.
Latest Khammam News