ఖమ్మం : – భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.
ఐ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచికంటి భవన్లో ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు… ఈ సందర్బంగా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ మధు మాట్లాడుతూ సెప్టెంబర్ 14,15,16 తేదీల్లో కరీంనగర్ పట్టణ కేంద్రంలో శుభం గార్డెన్స్ లో ఎస్.ఎఫ్.ఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నట్లు తెలిపారు.ఈ మహాసభలలో రాష్ట్రంలోని అనేక సమస్యల పై భవిష్యత్తులో ఉద్యమించేందుకు పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.
మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా 700 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు.అనేక ఉద్యమాలు నిర్మించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ప్రశ్నించేందుకు, ఎన్నో పోరాటాలతో ఎన్నో ఉద్యమాలతో విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి విద్యార్థులతో కలిసి పోరాటం చెయ్యడానికి ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర మహాసభలను విద్యార్థిలోకమంతా జయప్రదం చేయాలని, సంక్షేమ హాస్టల్ సమస్యలు, పెండింగ్ స్కాలర్షిప్లు మరియు రియంబర్స్మెంట్, పాఠశాలలు, కళాశాల సమస్యలు, అలాగే అనేక సమస్యల పరిష్కారానికి పలు తీర్మానాలతో పోరాటబాట చూపుతాయని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్, సాయి, రవి, గణేష్, రవితేజ, శ్రీనివాస్, రాహుల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు….