స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ వార్నర్ కూతురు.. ఎందుకంటే...

ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్ డేవిడ్‌ వార్నర్‌ సామాజిక మాధ్యమాల్లో సూపర్ యాక్టివ్‌గా ఉంటాడు.ఫన్నీ వీడియోలు, లిప్ సింకింగ్ వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను ఫిదా చేస్తుంటాడు.

 Daughter Of David Warner Who Cried In The Stadium Statidun, Dawid Warner, Ipl, D-TeluguStop.com

అంతేకాదు, వార్నర్‌ తన భార్య, ముగ్గురు కూతుళ్లతో కూడా వీడియోలు చేసి వాటిని అభిమానులకు షేర్ చేస్తాడు.ఇలా వార్నర్ కుటుంబం అందరికీ సుపరిచితమైంది.

అయితే క్రికెట్ ఆటకు వార్నర్ కూతుర్లు ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారో ఒక వైరల్ ఫొటో చెప్పకనే చెబుతోంది.

వివరాల్లోకి వెళితే.

ఐపీఎల్‌ 2022లో భాగంగా ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఏప్రిల్ 16న ఒక మ్యాచ్ జరిగింది.ఇందులో ఆర్‌సీబీ 189 స్కోర్ చేసింది.

అయితే ఈ స్కోరును అధిగమించలేక ఢిల్లీ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లో వార్నర్ 66 పరుగులు చేసి తన సత్తా చాటాడు.

అయితే కీలక సమయంలో అతడు ఔట్ కావడంతో అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియంకి వచ్చిన వార్నర్ కూతుర్లు ఇవీమే, ఇండీరే కూడా బాగా ఎమోషనల్ అయ్యారు.

ముఖ్యంగా వార్నర్ ఔట్ కాగానే పెద్ద కూతురు ఇవీమే బాగా ఏడ్చేసింది.ఏడుపు ఆపుకోలేక ఈ చిన్నారి ఏడుస్తుంటే అందరూ ఎమోషనల్ అయిపోయారు.ఈ ఫొటోని వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.ఆ ఫోటోలో వార్నర్‌ ఇవీమే, ఇండీరే బాగా బాధ పడుతున్నట్లు మీరు చూడొచ్చు.ఈ ఫొటో కింద “గేమ్ లో ఔట్ కావడం కామన్.ఈ విషయంలో ఏడవకూడదని అర్థమయ్యేలా చెప్తా” అని వార్నర్‌ రాసుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube