దగ్గుబాటి వారసుడి 'అహింస' ప్రివ్యూ

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం దగ్గుబాటి రామానాయుడు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం.నిర్మాతగా ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.

 Daggubati Abhiram Movie Ahimsa Preview ,daggubati Abhiram , Ahimsa , Suresh-TeluguStop.com

అత్యధిక భాషల్లో సినిమాలను నిర్మించిన ఆయన తెలుగు లో ఎన్నో అద్భుతమైన క్లాసిక్ సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే.ఆయన తనయుడు సురేష్ బాబు( Suresh Babu ) టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాత అనే విషయం తెలిసిందే.

ఇక సురేష్ బాబు తనయుడు రానా ఇప్పటికే పాన్ ఇండియా హీరో గా వెలుగు వెలుగుతున్నాడు.ఇలాంటి సమయంలో సురేష్ బాబు మరో తనయుడు అభిరామ్ దగ్గుబాటి హీరో గా పరిచయం అయ్యేందుకు సిద్ధమయ్యాడు.

Telugu Ahimsa, Daggubati, Teja, Preview, Suresh Babu, Tollywood-Movie

తేజ దర్శకత్వంలో రూపొందిన అహింస( Ahimsa ) అనే సినిమా తో అభిరామ్( Daggubati abhiram ) హీరోగా పరిచయం కాబోతున్నాడు.గత కొన్ని నెలలుగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.ఎట్టకేలకు రేపు విడుదల కాబోతుంది.సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు పెద్దగా పోటీ లేని సమయంలో రాబోతున్న అహింస సినిమా కి కచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ అంతా భావిస్తున్నారు.

కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.అహింస సినిమా కి పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.

Telugu Ahimsa, Daggubati, Teja, Preview, Suresh Babu, Tollywood-Movie

అది సినిమా కి ఒకందుకు మంచిదే.ఎందుకంటే భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలు ఈ మధ్య కాలంలో నిరాశ పరిచాయి.అందుకే అంచనాలు లేకుండా అహింస సినిమాను తీసుకు రాబోతున్నారు.గీతిక అనే అమ్మాయిని ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు.దర్శకుడు తేజ ఎంతో మంది కొత్త వారిని పరిచయం చేసి వారిని స్టార్స్ గా నిలబెట్టాడు.కనుక అభిరామ్ ని తేజ చేతిలో పెట్టినట్లుగా తెలుస్తోంది.

మరి తేజ గతంలో ఉదయ్ కిరణ్ నితిన్ ని ఎలా అయితే హీరోలుగా నిలబెట్టాడో అదే మాదిరిగా అభిరామ్ కి సక్సెస్ అనేది దక్కుతుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube