టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది.మెగా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతాఇంతా కాదు.
అయితే మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీ సినిమాలు బాగానే కలెక్షన్లను సాధిస్తున్నా మెగా యంగ్ హీరోలైన వరుణ్తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రం వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతున్నాయి.విరూపాక్ష మినహా సాయితేజ్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ మరీ భారీ స్థాయిలో హిట్ కాలేదు.
సాయితేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు కూడా రాలేదు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన మినహా ( Vaishnav Tej )మరో సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందలేదు.
వరుస ఫ్లాపుల వల్ల వైష్ణవ్ తేజ్ కు గతంతో పోల్చి చూస్తే మూవీ ఆఫర్లు సైతం తగ్గాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరో మెగా హీరో వరుణ్ తేజ్ ( Varun Tej )ప్రయోగాత్మక కథలతో నటుడిగా మంచి మార్కులు వేయించుకుంటున్నా కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమాలు నిర్మాతలను తీవ్రస్థాయిలో ముంచేస్తున్నాయి.ఆపరేషన్ వాలంటైన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి.వరుణ్ తేజ్ రేంజ్ కు ఈ కలెక్షన్లు ఏంటని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి, చరణ్ ( Chiranjeevi, Charan )జోక్యం చేసుకుని మెగా హీరోలు మంచి కథలను ఎంచుకునేలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ హీరోల కెరీర్ పుంజుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.కథల జడ్జిమెంట్ విషయంలో చిరంజీవి, చరణ్ పర్ఫెక్ట్ గా ఉంటారు.అందువల్ల ఈ ఇద్దరు హీరోలు మెగా యంగ్ హీరోల సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
వరుణ్, వైష్ణవ్, సాయితేజ్ సైతం మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది.