హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhibhavan ) లో ఇవాళ కాంగ్రెస్ కేంద్ర మ్యానిఫెస్టో కమిటీ భేటీ కానుంది.దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వెళ్లిన మ్యానిఫెస్టో కమిటీ అభిప్రాయాలను సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ( Telangana ) నేతల నుంచి మ్యానిఫెస్టో కమిటీ అభిప్రాయాలను సేకరించనుంది.ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి( Praveen Chakravarty ) ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరగనుంది.తెలంగాణ మ్యానిఫెస్టోపై జాతీయ కాంగ్రెస్ నేతల్లో పాజిటివ్ టాక్ నడుస్తోందని తెలుస్తోంది.ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారని సమాచారం.
కాగా రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మ్యానిఫెస్టో( Manifesto ) తయారీపై కమిటీ తీవ్ర కసరత్తు చేస్తుంది.