134 మంది పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ చార్జ్ మెమోలు జారీ

నల్లగొండ జిల్లా:జిల్లా వ్యాప్తంగా మూడు నుండి తొమ్మిది నెలల పాటు అనధికారికంగా సెలవులు పెట్టిన 134 మంది పంచాయితీ కార్యదర్శులకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చార్జ్ మెమోలు జారీ చేసి మరోసారి షాక్ ఇచ్చారు.నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సాగర్ నియోజకవర్గంలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు క్రీడలు కూడా నిర్వహించినట్లు,ఈ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.

దీనితో కలెక్టర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును బ్రేక్ చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.2024 డిసెంబర్ నెలలో కూడా క్రమశిక్షణ పాటించని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ చార్జ్ మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు మళ్ళీ చార్జ్ మెమో ఇవ్వడంతో ఏం జరుగుతుందోనని కార్యదర్శుల్లో ఉత్కంఠ నెలకొంది.

Collector Charge Memos Issued To 134 Panchayat Secretaries , 134 Panchayat Secre

Latest Nalgonda News