సూర్యాపేట జిల్లా:మోతె మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు గిర్దావర్లు (ఆర్ఐ)లను బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేశారు.ఆర్ఐలు పనిచేస్తున్న ఎస్.
కె మన్సూర్ అలీ,జె.నిర్మలదేవి పలు రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లుగా ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించడం జరిగిందని,విచారణలో ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్దారణ కావడంతో సస్పెండ్ చేసినట్లుగా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.