తోడికోడళ్లు అంటే గొడవలు అనేది సర్వసాధారణం.మరీ ముఖ్యంగా ఒకే ఇంట్లో ఉండే కోడళ్ళ మధ్య ఎప్పుడు ఏదో ఒక చిచ్చు బయట పడుతూనే ఉంటుంది.
అయితే ఇది సాధారణ, మధ్యతరగతి కుటుంబాల నుండి సెలబ్రిటీ ఫ్యామిలీల వరకు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి గొడవలు ఉంటాయి.అత్త ఒక కోడలిని పమెచ్చుకుంటే ఇంకో కోడలికి అది నచ్చదు.
ఇలా చిన్న చిన్న విషయాల్లో తోడికోడళ్ల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి.అయితే ఇక్కడ కేవలం మామూలు కుటుంబాలలోనే కాదు స్టార్ సెలబ్రెటీల కుటుంబాల్లో కూడా ఇవి ఉంటాయి అని ఇప్పుడు ఈ విషయం చూస్తే అర్థమవుతుంది.

ఇక మెగా ఫ్యామిలీలో మరికొద్ది రోజుల్లో కొత్త కోడలుగా అడుగు పెట్టబోతుంది లావణ్య త్రిపాటి( Lavanya Tripathi ) .అయితే కోడలుగా అడుగుపెట్టక ముందే లావణ్య త్రిపాటి ఉపాసన మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.అయితే సెలబ్రిటీల లైఫ్ లో కూడా ఇలాంటి గొడవలు జరుగుతాయా అంటే అది కామన్ అందరి కుటుంబాల్లో ఈ గొడవలు అనేవి జరుగుతాయి.కాని ఎక్కువగా బయటపడవు.
అయితే ఇప్పటికే వరుణ్ తేజ్ ( Varun tej ) లావణ్య త్రిపాఠి పెళ్లి విషయంలో కాస్ట్యూమ్స్ డిజైనర్ డెకరేషన్,అలాగే గెస్ట్లు ఎవరిని పిలవాలి,గెస్ట్ లకు రిటర్న్ గిఫ్టులు ఎలాంటివి ఇవ్వాలి అనే దానిలో పూర్తిగా ఉపాసననే నిర్ణయం తీసుకుంటుంది అని ఓ వార్త వినిపించింది.అయితే ఈ విషయంలో లావణ్య త్రిపాటి మాత్రం అభిప్రాయం వేరే విధంగా ఉండడంతో తనకి ఉపాసన సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్ డిజైన్స్( Costume Designs ) నచ్చలేదట.
దాంతో నచ్చని పని ఎందుకు చేయడం అని ఉపాసనకి మొహం మీదే చెప్పిందట.

అయితే లావణ్య అలా చెప్పడంతో కాస్త మొహమాటం అనిపించి ఉపాసన ( Upasana ) అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోయిందట.కానీ లావణ్య త్రిపాటి మాత్రం నా పెళ్లిలో ఆమె పెత్తనం ఏంటి నాకు నచ్చిందే నేను చేస్తా, నా పెళ్లి విషయంలో నా మాటే నెగ్గాలి అని వరుణ్ తో చెప్పిందట.అయితే ఇద్దరిలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక వరుణ్ తేజ్ సైలెంట్ అయిపోయారట.
ఇలా పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి ఉపాసన మధ్య చిన్నపాటి గొడవలు మొదలయ్యాయి అంటూ నెట్టింట్లో ఒక వార్త వినిపిస్తోంది.