రేపటి నుండి వైయస్సార్ జిల్లాలో సీఎం జగన్ రెండు రోజుల పర్యటన..!!

రేపటి నుండి సీఎం జగన్ రెండు రోజులపాటు వైయస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాయచోటిలో మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానమ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.

ఆపై మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లోనూ పాల్గొంటారు.అనంతరం సొంత నియోజకవర్గం పులివెందులలో మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీ కృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం శిల్పారామంను ప్రారంభిస్తారు.

ఆపై శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ పాఠశాలకు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.

ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని రాత్రి ఇడుపులపాయ వైయస్సార్ ఎస్టేట్ గెస్ట్ హౌజ్ లో బస చేస్తారు.10వ తారీకు ఉదయం ఇడుపులపాయలు ఆర్ కే వ్యాలీ.పోలీస్ స్టేషన్ నీ జగన్ ప్రారంభిస్తారు.

Advertisement

ఆ తర్వాత జమ్మలమడుగులో కూడా మరో పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుద్ది.అనంతరం ఎకో పార్క్.

వేముల మండలం ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు.పదవ తారీకు మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి పయనమవుతారు.

ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.

1980లో అమెరికాకి వలస వెళ్లిన భారతీయ మహిళ.. ఇప్పుడు ఎలా ఉందంటే..
Advertisement

తాజా వార్తలు