అయోధ్యలో మెగా కుటుంబానికి ఘన స్వాగతం.. ఫోటోలు వైరల్!

ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) ఏర్పాటు కల సాకారం అయ్యింది.నేడు ప్రతిష్టాత్మక రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.

 Chiranjeevi Ramcharn Gets A Warm Welcome To Ayodhya , Ramcharan, Chiranjeevi, Su-TeluguStop.com

ఈ అద్భుతమైన కార్యాన్ని చూడటం కోసం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ వేడుకను కన్నులారా తిలకించడం కోసం ఎంతోమంది ప్రముఖ దిగ్గజ నటీనటులు వ్యాపారవేత్తలు క్రీడ రంగానికి చెందిన ప్రముఖులు కూడా అయోధ్య చేరుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మెగా కుటుంబం ( Mega Family ) కూడా అయోధ్యలో సందడి చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ( Chiranjeevi ) అయోధ్య ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.దీంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు తన భార్య సురేఖ (Surekha) అలాగే కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) అయోధ్యకు నిన్ననే బయలుదేరారు.ఇక నేడు స్వామి వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్నటువంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.

అయోధ్య ఆలయ కమిటీ సభ్యులు చిరంజీవి, రామ్ చరణ్ లకు శాలువాలు కప్పి ఆహ్వానించారు.అనంతరం వారితో ఫోటోలు దిగారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 ఇక అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం రావడంతో సాక్షాత్తు ఆ చిరంజీవిడే నన్ను ఆహ్వానించినట్టు ఉంది అంటూ చిరంజీవి వెల్లడించారు ఇలాంటి అద్భుతమైనటువంటి భాగ్యం తనకు కలగడం పూర్వజన్మ సుకృతం అంటూ చిరంజీవి అయోధ్య ఆహ్వానం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి తదితరులు అయోధ్యకు చేరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube